
What is NAV: ఇటీవలి కాలంలో భారతీయ ప్రజలకు పెట్టుబడులపై అవగాహన క్రమంగా పెరుగుతోంది. స్టాక్ మార్కె్ట్లలో పెట్టుబడుల నుంచి మ్యూచువల్ ఫండ్స్ వరకు అనేక సాధనాల్లో ప్రజలు ఇన్వెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే చిన్న ఇన్వెస్టర్లకు కూడా అనుకూలంగా ఉండటంతో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ను తమ పెట్టుబడులకు సరైన ఎంపికగా మార్చుకుంటున్నారు.
మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరూ దానికి సంబంధించిన బేసిక్స్, వాటి పనితీరు గురించి తప్పక తెలుసుకోవాలి. ముందుగా మ్యూచువల్ ఫండ్ అనగానే చాలా మంది గమనించేది NAV. దీనిని ఫండ్ నెట్ అసెట్ వాల్యూ అని పిలుస్తారు. ఇది మన పెట్టుబడి యూనిట్ల ప్రస్తుత ధరలను సూచిస్తుంది. ఇది రోజువారీ ప్రాతిపధికన మారిపోతూ ఉంటుంది. ఇది పెట్టుబడిదారులు హోల్డ్ చేస్తు్న్న మ్యూచువల్ ఫండ్ ఒక్కో విలువను సూచిస్తుంది.
►ALSO READ | Defence Stock: ఫ్రెంచ్ సంస్థతో డ్రోన్ మేకర్ ఒప్పందం.. ఆ కిల్లర్ డ్రోన్స్ ఇండియాలో తయారీ!
అయితే NAVకి లెక్కించటానికి ఒక నిర్థిష్ట ప్రక్రియను ఏఎంసీలు ఫాలో అవుతుంటాయి. అదేంటంటే.. మ్యూచువల్ ఫండ్ సంస్థ ఫండ్ ఆస్తుల నుంచి దాని ఖర్చులు, చెల్లించాల్సిన మెుత్తాలను తీసివేసిన తర్వాత దానిని మెుత్తం ఉన్న యూనిట్లతో భాగహరిస్తుంది. దీంతో ఒక్కో యూనిట్ నెట్ అసెట్ వాల్యూ వస్తుందని గుర్తుంచుకోవాలి. అయితే చాలా మంది NAV ఎక్కువ ఉన్న ఫండ్స్ మంచివని, తక్కువగా ఉన్న ఫండ్ సరిగా పనిచేయటం లేదని భావిస్తుంటారు. కానీ అది పూర్తిగా అవాస్తవం.. ఫండ్ పనితీరును తెలుసుకోవటానికి కేవలం ఈ ఒక్క విలువను ప్రమాణికంగా తీసుకోవటం సరైనది కాదని నిపుణులు చెబుతుంటారు.
ఈ విలువ రోజువారీ మారుతున్నందున అది మన పెట్టుబడి విలువ ఎలా ఉంది, పెరిగిందా లేక తగ్గిందా అనే విషయాలను మాత్రమే సూచిస్తుంది. ఫండ్ ఎలా పనిచేస్తుంది, ఎంత రాబడిని ఫండ్ అందించగలదు వంటి సమగ్ర సమాచారాన్ని దీని ద్వారా ఇన్వెస్టర్లు తెలుసుకోలేరు. అయితే మార్కెట్ల పవతం వంటి సమయాల్లో సహజంగా చాలా మంది మంచి ఫండ్లను తక్కున నెట్ అసెట్ వాల్యూల వద్ద కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఇది భవిష్యత్తులో విలువను పెంచగలవని వారు నమ్ముతుంటారు.