హబ్సిగూడలో దారుణం..మతిస్థిమితంలేని చిన్నారిపై లైంగిక దాడి

హబ్సిగూడలో దారుణం..మతిస్థిమితంలేని చిన్నారిపై లైంగిక దాడి

హైదరాబాద్లో దారుణం..అమానవీయ సంఘటన.. మతిస్థిమితంలేని చిన్నారిపై లైంగిక దాడి..చికిత్సకోసం వచ్చిన బాలికపై డాక్టర్ వికృత చేష్టలు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హబ్సిగూడలో ఓ బాలికపై డాక్టర్ లైంగిక దాడి ఘటన బుధవారం (జూన్ 18) వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళితే.. 

ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని  వైబ్రెన్ట్ వింగ్ చిల్ట్రన్ డెవలప్ సెంటర్ కేర్ డాక్టర్ రంజిత్ నాలుగేళ్ల చిన్నారిపై  లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మానసికం ఎదుగుదల లేని నాలుగేళ్ల చిన్నారికి నాలుగు నెలలుగా హబ్సిగూడ వైబ్రిన్ట్ వింగ్స్ లో వైద్యం అందిస్తున్నారు. 

ఈ క్రమంలో బాలికపై లైంగికదాడి చేశాడని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఓయూ పోలీసులు.. బాలికను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే రంజిత్ డాక్టర్ కాదని..వారిని నమ్మించి దారుణానికి పాల్పడ్డాడని ఆరోపిస్తోంది బాలిక తల్లి.