
పెళ్లైన కొద్ది రోజులకే.. హనీమూన్ పేరున భర్తను హతమార్చుతున్న ఈ రోజుల్లో.. వివాహ బంధం అంటే ఏంటో నిరూపించారు మహారాష్ట్రలోని వృద్ధ దంపతులు. 93 ఏళ్ల వయసులో ఓ తాత భార్య కోసం జువెలరీ షాప్ కు వెళ్లి స్వయంగా తాళి బొట్టు కొనటం అక్కడున్న అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భార్యను వెంటపెట్టుకుని షాప్ కు వెళ్లి ఆమెకు నచ్చిన తాళిని తాత కొనిస్తుండటం సిబ్బందినీ, కస్టమర్లను అబ్బురపరిచింది. ఆ జంటకు షాప్ ఓనర్ ఇచ్చిన సర్ ప్రైజ్ అందరినీ ఆకట్టుకుంది.
మహారాష్ట్రలోని ఛత్రపతి షంభాజీ నగర్ లో ఈ అపురూపమైన ఘటన చోటుచేసుకుంది. 93 ఏళ్ల నివృతి షిండే అనే తాతా తన భార్య శాంతాబాయి తో ఆభరణాల షాప్ కు వెళ్లారు. జాల్నా జిల్లాలోని అంభోరా జహంగీర్ గ్రామానికి చెందిన దంపతులు పండరీపూర్ లోని ఆశాదీ ఏకాదశి వేడుకలకు వెళ్తున్న క్రమంలో ఈ దృశ్యం చోటు చేసుకుంది.
అయితే వాళ్లు షాప్ లోకి వెళ్లినప్పుడు ఏదైనా సహాయం అడుగుతారో లేదా.. అడుక్కోవడానికి వచ్చారేమోనని అందరూ భావించారు. కానీ తన భార్యకు మంగళ సూత్రం కొనడానికి వచ్చినట్లు చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.
ఆ వయసులో భార్య కోసం మంగళ సూత్రం కొనాలని వచ్చిన తాతను.. ఆ జంటను చూసి షాప్ ఓనర్ ఇంప్రెస్ అయ్యాడు. వందేళ్లకు చేరుకుంటున్న జంట.. ఇంత అనురాగంగా, ప్రేమగా ఉండటం చూసి అబ్బురపడి.. కేవలం 20 రూపాయలు తీసుకుని మంగళ సూత్రం గిఫ్ట్ గా ఇచ్చాడు. వాళ్లు ఆనంద భాష్పాలకు అవధులు లేకుండా పోయింది. ఈ దృశ్యం అక్కడున్న అందరినీ ఆకట్టుకుంది.
‘‘తాత భామ్మ షాపులోకి వచ్చారు. తన భార్యకు మంగళ సూత్రం కావాలని అడిగాడు. పదకొండు వందల ఇరవై (రూ.1120) ఇచ్చి మంగళ సూత్రం కావాలని అడిగాడు. వారు అడిగే విధానం.. భార్య కోసం ఆ వయసులో ఆయన పడే తపన చూసి చాలా ఆశ్చర్యం వేసింది. అందుకే జస్ట్ టోకెన్ అమౌంట్ 20 రూపాయలు తీసుకుని తాళి వాళ్లకు గిఫ్ట్ గా ఇచ్చాను’’ అని చెప్పడు షాప్ ఓనర్.
►ALSO READ | Starlinkకి భారత్ లైసెన్స్.. త్వరలోనే సర్వీసెస్ స్టార్ట్స్, ఇక హై స్పీడుతో నెట్..
స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. నివృతి షిండే-శాంతాబాయి జంట తరచుగా తీర్థయాత్రలకు వెళ్తుంటారట. వారికి ఒక కొడుకు ఉన్నప్పటికీ.. వారి అవసరాలు వారే తీర్చుకుంటారు. ఒకరి కోసం ఒకరు పరితపిస్తూ ఉంటారు. వారి అన్యోన్యతను చూసి ప్రయాణంలో చాలా మంది వారికి సహాయం చేస్తుంటారు స్థానికులు చెప్పారు.
పెళ్లంటే మూణ్నాళ్ల ముచ్చట అన్నట్లుగా విడాకులు తీసుకుంటూ, హత్యలు చేసుకుంటున్న ఈ రోజుల్లో కడవరకు ఒకరి కోసం ఒకరు బతికే వీళ్ల గురించి తెలిసీ నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వాళ్లకు తాళిని గిఫ్ట్ గా ఇచ్చిన షాప్ ఓనర్ కు శభాస్ అని అభినందిస్తున్నారు.