Samantha Viral Video: ఎక్కడ పడితే అక్కడ ఫొటోలు తీస్తారా: ఫొటోగ్రాఫర్పై సమంత ఆగ్రహం

Samantha Viral Video: ఎక్కడ పడితే అక్కడ ఫొటోలు తీస్తారా: ఫొటోగ్రాఫర్పై సమంత ఆగ్రహం

టాలీవుడ్ హీరోయిన్ సమంతకు ఫొటోగ్రాఫర్లు చికాకు తెప్పించారు. జూన్ 17న ఉదయం, ముంబైలో సమంత తన జిమ్ ముగుంచుకుని బయటకి వస్తుంది. ఈ క్రమంలో ఫోటోగ్రాఫర్లు ఆమెను ఫోటోలు, వీడియోల కోసం అడుగుతున్నారు.

అయితే, సామ్ జిమ్ వేర్లో ఉండటంతో.. ఫోటోలు తీయొద్దని రిక్వెస్ట్ చేసింది. అయినా, వినకుండా ఫొటోగ్రాఫర్లు తమ అత్యుత్సాహంతో ఫోటోలు తీసి సమంతను ఇబ్బంది పెట్టారు. ఈ క్రమంలో ఫోటోగ్రాఫర్లపై సమంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

మరో వీడియోలో, సమంత జిమ్ కాంప్లెక్స్ నుండి ఫోన్ మాట్లాడుకుంటూ బయటకి వస్తుండగా.. ఫోటోగ్రాఫర్లు ఫోటోలు కోసం ప్రయత్నించారు. అందులో ఒకతను "హలో, సమంత మేడమ్, గుడ్ మార్నింగ్" అని ఫోటో తీస్తుండగా.. దాంతో కోపం తెచ్చుకున్న సమంత, "క్షమించండి' అని చెబుతూ వారిని దాటుకుంటూ వెళ్ళింది. అప్పటికీ, ఫోటోగ్రాఫర్లు వినకపోవడంతో, ఆమె 'అర్రే రుకో జీ (ఆగండి) దయచేసి అంటూ రిక్వెస్ట్ చేసింది.

అదే క్రమంలో రోడ్డు దగ్గర పార్క్ చేసిన తన కారు కనిపించకపోవడంతో, అక్కడున్న ఫొటోగ్రాఫర్ల తాకిడి తట్టుకోలేక సమంత తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో సమంత తన సహనాన్ని చూపిస్తుంది. కానీ, ఫొటోగ్రాఫర్లు తన మాటలు ఏ మాత్రం లెక్కచేయట్లేదు. ఇది కరెక్ట్ కాదని చెబుతూ సామ్ మళ్లీ లోపలకి వెళ్ళింది. 

►ALSO READ | Vijay-Rashmika: రష్మిక ‘కుబేర’ సినిమాకు విజయ్ విషెష్.. అంతలోనే ఒకే కారులో జోడీ చక్కర్లు

ఫొటోగ్రాఫర్లు కేవలం తమ రేటింగ్ కోసం ఇలా ఫొటోలో తీసి ఇబ్బందిపెట్టడం మంచి పద్ధతి కాదంటూ.. సమంత ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు సైతం సీరియస్ అవుతున్నారు.  కోల్పోతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సమంత ఇటీవలే తెలుగులో తన సొంత నిర్మాణంలో 'శుభం' మూవీ తెరకెక్కించింది. ఈ మూవీతో నిర్మాతగా మారింది. మెసేజ్ తో కూడిన ఈ హారర్ కామెడీ మూవీ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి చాలా ప్రశంసలు అందుకుంది. సమంత ప్రస్తుతం రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్న 'రక్త్ బ్ర‌హ్మాండ్' వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అలాగే తెలుగులో మా ఇంటి బంగారం మూవీలో నటిస్తూ, నిర్మిస్తుంది.