Vijay-Rashmika: రష్మిక ‘కుబేర’ సినిమాకు విజయ్ విషెష్.. అంతలోనే ఒకే కారులో జోడీ చక్కర్లు

Vijay-Rashmika: రష్మిక ‘కుబేర’ సినిమాకు విజయ్ విషెష్.. అంతలోనే ఒకే కారులో జోడీ చక్కర్లు

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మరోసారి కలిసి దర్శనమిచ్చారు. ఒకే కారులో పక్కపక్కన కూర్చొని ప్రయాణిస్తూ ఈ జంట కనిపించింది. బుధవారం జూన్ 17 రాత్రి, ఈ జంట ముంబై విమానాశ్రయంలో కనిపించారు. ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చి ఒకే కారులో బయలుదేరారు. తమ ముఖాలకు మాస్కులు ధరించి, కారు వెనుక సీట్లో కూర్చుని, తమకేం తెలియదన్నట్లుగా ఉన్నారు.  ఇక వీరి ఫోటోలు, వీడియోలు కెమెరామెన్ లకు చిక్కడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో వీళ్లు రిలేషన్‌లోనే ఉన్నారనే వార్తలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ తరుణంలోనే లేటెస్ట్ గా.. రష్మిక నటించిన కుబేర టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ విజయ్ ఓ ట్వీట్ చేశాడు.

'నా కెరీర్‌లో దర్శకుడు శేఖర్‌ కమ్ములకు ప్రత్యేక స్థానం ఉంటుంది. నాలాంటి ఎంతో మంది నటుల ఆశలను ఆయన నిజం చేశారు. నాకు ఇష్టమైన నటులు నటించిన ఈ సినిమాను బిగ్‌స్క్రీన్‌పై చూడడం కోసం ఆసక్తిగా ఉన్నాను. మొత్తం బృందానికి నా ప్రేమ మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థియేటర్లలో చూడటానికి వేచి ఉండలేను' అని విజయ్ పోస్ట్‌ పెట్టారు. అంతలనే వీరు ఒకేకారులో ప్రయాణిస్తున్న వీడియోలు బయటకి రావడంతో మరోసారి వీరి డేటింగ్ రూమర్స్ నిజమనే విషయాన్ని వ్యక్తపరుస్తున్నాయి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

ఇదిలా ఉంటే .. రష్మిక, విజయ్ దేవరకొండ డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. ఈ జంట తమకు తాముగా ఈ వార్తలపై డైరెక్ట్గా ఎప్పుడు స్పందించలేదు. కానీ, మేం ఒక్కటవ్వబోతున్నాం అనేలా ఫోటోలు షేర్ చేస్తూ.. వైరల్గా నిలుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్గా ఈ జంట మరోసారి కనిపించడంతో..పెళ్లి వార్తలు ఊపందుకున్నాయి.

రష్మిక బర్త్ డే సెలబ్రేషన్స్: 

ఇటీవలే, 2025 ఏప్రిల్ 5న, రష్మిక తన 29వ పుట్టినరోజును ఒమన్‌లో జరుపుకుంది. ఈ సందర్భంగా ఒమన్‍లోని ఓ బీచ్‍లో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. అయితే, విజయ్ దేవరకొండ సైతం ఒక్కరోజు గ్యాప్ లోనే బీచ్‌సైడ్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.

ఇక ఇద్దరు పోస్ట్ చేసిన ఫొటోల్లో బీచ్ ఒకేలా కనిపించడంతో, కలిసి బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్నారనే రూమర్లు ఇప్పుడు బయటకు వచ్చాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ జంట బర్త్ డే సెలెబ్రేషన్స్ తో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. 

రష్మిక, విజయ్ ప్రస్తుత సినిమాలు:

రష్మిక ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా సరసన 'థమా' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా 2025 దీపావళికి విడుదల కానుంది. ఈ సినిమాలో పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా నటిస్తున్నారు. నాగార్జున, ధనుష్ లతో కలిసి నటించిన 'కుబేరా' జూన్ 20న రీలిజ్ కానుంది. వీటితో పాటుగా కాక్‌టెయిల్ 2 (షాహిద్ కపూర్ మరియు కృతి సనన్‌లతో), ది గర్ల్‌ఫ్రెండ్, రెయిన్‌బో, ఏక్ సాత్ దో దో మరియు మరిన్ని సినిమాలున్నాయి. 

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన తన స్పై థ్రిల్లర్ కింగ్‌డమ్ జూలై చివరి వారంలో థియేటర్లలో విడుదలకు సిద్దమవుతుంది. ఆ తర్వాత రవికిరణ్ కోలా యొక్క SVC 59 మరియు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఓ పీరియాడిక్ (VD 14) సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే వీరిద్దరు కలిసి ‘గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌’ మూవీస్ లో కలిసి నటించి మెప్పించారు.