నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం, 8 మంది మృతి

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం, 8 మంది మృతి

ఏపీ నెల్లూరు జిల్లాలో ఇవాళ తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు దగ్గర లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో టెంపోలో 8 మంది చనిపోయారు. ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే చనిపోగా... మరో వ్యక్తి హాస్పిటల్ కు తరలిస్తుండగా మృతి చెందాడు. బాధితులు తమిళనాడు వాసులుగా గుర్తించారు. చెన్నై నుంచి వచ్చిన వీరంతా శ్రీశైలంతో పాటు వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకొని నెల్లూరుకు వెళ్తున్నారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో దామరమడుగు దగ్గర్లో పెట్రోల్  బంక్  దగ్గర ఆగి ఉన్న లారీని టెంపో ఢీకొట్టింది.  ప్రమాదంలో టెంపో ముందు భాగం నుజ్జునుజ్జైంది. డ్రైవర్  గుర్నాథంతో పాటు, వాహనంలో ముందుకూర్చున్న మరో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. టెంపోలోని 8 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో టెంపోలో మొత్తం 15 మంది ఉన్నారు. స్థానిక పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. డ్రైవర్  నిద్రమత్తు, పొగ మంచు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు.