ముంబై: దేశంపై భరోసా ఉంచాలని, ఎవరో విదేశీ మంత్రులు చేసిన వ్యాఖ్యలను నమ్మవద్దని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేయకపోవడం వల్లే భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చలేదన్న యూఎస్ విదేశాంగ మంత్రి హొవార్డ్ లుట్నిక్ వ్యాఖ్యలపై గోయల్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆదివారం ముంబైలో ఎన్డీటీవీ నిర్వహించిన కాంక్లేవ్ లో ఆయన మాట్లాడారు. అమెరికా, భారత్ కు సంబంధించిన వాణిజ్య ఒప్పందాల అంశాలను మీడియా ముందు మాట్లాడబోరని, అలాంటి వ్యవహారాలపై తెర వెనుక చర్చలు జరుపుతారని ఆయన చెప్పారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఏడాది కాలంగా చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
