ఈ వారం రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌పై మార్కెట్ ఫోకస్‌‌‌‌‌‌‌‌

ఈ వారం రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌పై  మార్కెట్ ఫోకస్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌ను  బ్లూ-చిప్ కంపెనీల డిసెంబర్ క్వార్టర్ (క్యూ3) ఫలితాలు, ద్రవ్యోల్బణ డేటా, గ్లోబల్ ట్రెండ్స్‌‌‌‌‌‌‌‌ నిర్ణయించనున్నాయి. ఈ నెల 12న టీసీఎస్‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్ టెక్, 14న  ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌, 16న  రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, 15న జియో ఫైనాన్షియల్ సర్వీసెస్   తమ క్వార్టర్లీ రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించనున్నాయి. 

ట్రంప్- విధించిన టారిఫ్‌‌‌‌‌‌‌‌లపై యూఎస్‌‌‌‌‌‌‌‌ సుప్రీం కోర్టు తీర్పు జనవరి 14న వెలువడనుంది.  గ్లోబల్ మార్కెట్లపై దీని ప్రభావం ఉంటుంది.  ఇండియా రిటైల్ ద్రవ్యోల్బణం (12న), హోల్‌‌‌‌‌‌‌‌సేల్ ద్రవ్యోల్బణం (15న) కూడా ఈ వారం విడుదలకానున్నాయి.