Prabhas: 'ది రాజా సాబ్' పైరసీ కలకలం.. ఏకంగా రెస్టారెంట్ టీవీల్లోనే సినిమా ప్రదర్శన!

Prabhas: 'ది రాజా సాబ్' పైరసీ కలకలం.. ఏకంగా రెస్టారెంట్ టీవీల్లోనే సినిమా ప్రదర్శన!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందిన భారీ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ది రాజా సాబ్' (The Raja Saab). సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. అయితే, ఈ మెగా సక్సెస్ మధ్య ఒక చేదు వార్త చిత్ర యూనిట్‌ను కలవరపెడుతోంది.

యూఎస్ రెస్టారెంట్‌లో పైరసీ కలకలం!

' ది రాజా సాబ్'  చిత్రం విడుదలైన కేవలం 24 గంటల్లోనే హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ అయింది. అయితే ఇది ఆన్ లైన్ లో అవ్వడం ఒక ఎత్తయితే.. ఏకంగా అమెరికాలోని ఒక రెస్టారెంట్‌లో ఈ పైరసీ కాపీని ప్లే చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. యూఎస్‌లోని ఒహియో రాష్ట్రం, డబ్లిన్ నగరంలో ఉన్న ఒక నార్త్ ఇండియన్ రెస్టారెంట్‌లో, టీవీ స్క్రీన్లపై 'ది రాజా సాబ్' పైరసీ వెర్షన్‌ను ప్రదర్శిస్తుంచారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ALSO READ : ముంబై నుంచి వచ్చానంటే ఛాన్సులు ఇచ్చేవారేమో?

ఒక ఎన్నారై పేజీ ద్వారా బయటకు వచ్చిన ఈ వీడియోను చూసి ప్రభాస్ అభిమానులు భగ్గుమంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమా తీస్తే.. ఇలా బహిరంగంగా పైరసీని ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఉదంతంపై దృష్టి సారించారు. ఇప్పటికే 'ఐబొమ్మ' (iBomma) నిర్వాహకుడు రవి ఎమండి అరెస్ట్ తర్వాత.. ఇలాంటి వెబ్‌సైట్లపై నిఘాను పెంచారు. అయినప్పటికీ శ్రీలంక కేంద్రంగా పనిచేస్తున్న మరికొంతమంది పైరేట్స్ ఈ సినిమాను లీక్ చేసినట్లు అనుమానిస్తున్నారు.

 

నెగటివ్ టాక్ ఉన్నా..

విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన (Mixed Reviews) వచ్చినప్పటికీ, ప్రభాస్ క్రేజ్ ముందు అవేవీ నిలబడలేదని వసూళ్లు చెప్తున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.158.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమా ఇప్పటికే 3 మిలియన్ డాలర్ల మార్కును దాటి దూసుకుపోతోంది. ఇండియా నెట్ కలెక్షన్స్ దాదాపు రూ109 కోట్ల మేర వసూళ్లు సాధించినట్లు సినీ ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దర్శకుడు మారుతి ఈ చిత్రంలో ప్రభాస్‌ను వింటేజ్ లుక్‌లో ఎంతో స్టైలిష్‌గా చూపించారని, ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ , ప్రభాస్ కామెడీ టైమింగ్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

ALSO READ : 'వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్'..