టాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయసక్కర్లేదు. 'మల్లేశం' మూవీతో హీరోయిన్ గా మారిన ఈ చిన్నది వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ "వకీల్ సాబ్' సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్ చిత్రాలతో పాటు అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే లేటెస్ట్ గా ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ పనితీరుపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది.
బొంబాయి నుంచి వచ్చిన హీరోయిన్లకు లభించేంత స్పీడ్ గా ఇక్కడ తెలుగు అమ్మాయిలకు చాన్సులకు రావడం లేదని అనన్య బాంబ్ పేల్చింది.. నేను ముంబై నుంచి వచ్చానని చెప్పుంటే అవకాశా లు త్వరగా వచ్చేవేమో అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కానీ ఇండస్ట్రీలో దీర్ఘకాలిక కెరీర్ కొనసాగించాలంటే మాత్రం తెలుగు అమ్మాయిలే సరైన ఎంపిక అని చెప్పుకొచ్చింది.. 'వకీల్ సాబ్' వంటి పెద్ద సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వస్తాయని ఆశించినప్పటికీ, మధ్యలో కొంత గ్యాప్ వచ్చిందని చెప్పింది.
►ALSO READ | Chiranjeevi : 'వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్'.. బ్లాక్బస్టర్ సంబరాల్లో మెగాస్టార్, అనిల్ రావిపూడి!
నాకు కేవలం ట్రెడిషనల్ పాత్రల కే పరిమితం చేయొద్దని అనన్య కోరుతోంది. అవసర మైతే గ్రామర్ రోల్స్ చేయడాని కూడా నేను రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అందుకే సోషల్ మీడియాలో తన ఫోటోషూట్ ద్వారా నా ఇమేజ్ మార్చుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పింది. తన ఐదేండ్ల సినీ కెరీర్ లో కరోనా కారణంగా రెండేళ్లు నష్టపోయినా, ప్రస్తు తం ఏకంగా ఏడు సినిమాలు విడు దలకు సిద్ధంగా ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ తెలుగు బ్యూటీ చేసిన కామెంట్స్.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
