BRS మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఐదు కోట్ల ఆస్తులు అటాచ్

BRS మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఐదు కోట్ల ఆస్తులు అటాచ్

హైదరాబాద్: BRS మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి చెందిన ఐదు కోట్ల ఆస్తులను ఐటీ శాఖ అటాచ్ చేసింది. బినామీ యాక్ట్ కింద పలు ఆస్తులు అటాచ్ చేయడం గమనార్హం. తన కూతురు భవాని రెడ్డి పేరు మీద జనగాం, సిద్దిపేటలో ముత్తిరెడ్డి ప్లాట్లు కొన్నట్లు ఐటీ తనిఖీల్లో తేలింది. వీటికి సంబంధించి ఆయన కూతురు భవానీ రెడ్డి స్టేట్మెంట్ కూడా ఇప్పటికే ఐటీ తీసుకోవడం గమనార్హం.

భూములు కొనేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తనకు తెలియదని భవాని రెడ్డి చెప్పారు. తన తండ్రి చెప్పడంతోనే Sell డీడ్పై సంతకాలు చేసినట్టు ఐటీకి ముత్తిరెడ్డి కూతురు స్టేట్మెంట్ ఇచ్చారు. తన కూతురిని బినామీగా పెట్టి ఆస్తులు సంపాదించినట్టు ముత్తిరెడ్డిపై ఐటీ ఆరోపణ. సిద్దిపేట, జనగాంలో 5 కోట్లు విలువ చేసే ఈ ఆస్తులను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసింది. 

►ALSO READ | శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉండి.. అసెంబ్లీలో మారీచులను ఆడిస్తున్నాడు: సీఎం రేవంత్