శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉండి.. అసెంబ్లీలో మారీచులను ఆడిస్తున్నాడు: సీఎం రేవంత్

 శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉండి.. అసెంబ్లీలో మారీచులను ఆడిస్తున్నాడు: సీఎం రేవంత్

ప్రభుత్వానికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన వ్యక్తి ఫాం హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం (జనవరి 12) గెజిటెడ్ ఆఫీసర్స్ డైరీ 2026 ను ఆవిష్కరించిన సీఎం.. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సూచనలు చేయాల్సిన కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితయ్యారని విమర్శించారు.  శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉండి.. అసెంబ్లీలో మారీచులను ఆడిస్తున్నాడని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు పట్టించుకోవద్దని ఈ సందర్భంగా ఉద్యోగులకు సూచించారు సీఎం.  కడుపులో విషం పెట్టుకుని అలా మాట్లాడుతున్నరని అన్నారు. ఫాం  హౌస్ లో ఒకాయన ఉంటే అసెంబ్లీలో మరో ఇద్దరు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వాళ్ల మాటలు పట్టించుకోవద్దని చెప్పారు. 

గత ప్రభుత్వం ఉద్యోగులకు రిటైర్మెంట్, పెన్షన్, మెడికల్ బిల్స్ చెల్లించలేదని గుర్తుచేశారు సీఎం రేవంత్. తమ ప్రభుత్వం రాగానే వీటిపై అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేశామని తెలిపారు. 

 సీఎం పదవి వస్తే సంతోషం అనుకున్నానని.. సీఎం అయ్యాక బరువు, బాధ్యతలు పెరిగాయని అన్నారు. పీసీసీ చీఫ్ గా 12 గంటలు కష్టపడ్డాని.. ఇప్పుడు 18 గంటలు కష్టపడుతున్నా సమయం సరిపోవడం లేదని చెప్పారు సీఎం రేవంత్.