ఎంత అవగాహన కల్పిస్తున్నా ఆన్ లైన్ ట్రేడింగ్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. రూపాయి పెట్టుబడికి మూడు నాలుగు రెట్లు లాభం వస్తుందని ఆశ చూపి అమాయకులను ట్రాప్ చేస్తున్నారు కేటుగాళ్లు. సోషల్ మీడియా ద్వారా ఆకర్శించి.. పెట్టుబడి పెట్టించి.. సర్వం ఊడ్చేశాక ఎస్కేప్ అవుతున్నారు.
సోమవారం (జనవరి 12) హైదరాబాద్ లో ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట 27 లక్షల రూపాయలు దోచుకున్నారు మోసగాళ్లు. ఆసిఫ్‌నగర్‌కు చెందిన 38 ఏళ్ల వ్యక్తిని ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా ట్రాప్ చేసిన మోసగాళ్లు.. నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. విడతల వారీగా దాదాపు రూ.27 లక్షలను పెట్టుబడి పెట్టించారు.
►ALSO READ | లింగ వివక్ష ప్రయాణాల్లోనూ ఉందా ? సెలవుల్లోనూ తప్పని తిప్పలు.. వెకేషన్ అంటే ఎక్కువ పనేనా?
ఇన్వెస్ట్ చేస్తున్న కొలదీ యాప్‌లో భారీ లాభాలు చూపిస్తూ నమ్మించారు. ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందామని విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించగా విత్ డ్రా కాకపోవడంతో ఆ వ్యక్తులను ప్రశ్నించాడు. దీంతో మరింత డబ్బు డిమాండ్ చేయడంతో మోసం జరిగినట్టు బాధితుడు గుర్తించాడు. బాధితుడు సైబర్ క్రైం పోలీసులు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
