- ప్రతీకారం తీర్చుకుంటామని మసూద్ అజర్ వార్నింగ్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ‘జైష్ ఎ మహ్మద్’ చీఫ్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ ఇండియాను ఉద్దేశించి చేసిన ఒక ఆడియో మెసేజ్ ఇప్పుడు వైరల్ అవుతున్నది. అందులో ఇండియాపై దాడి చేయడానికి తమ వద్ద ఉన్న ఆత్మాహుతి దళ సభ్యుల సంఖ్యను ప్రస్తావిస్తూ... ‘‘మా దగ్గర ఉన్నది ఒకరో.. ఇద్దరో.. వంద మందో.. వెయ్యి మందో కాదు... అంతకు మించి ఉన్నరు’’ అని తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశాడు. ఇండియాపై మెరుపు దాడులు చేసి ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చాడు. జైషే ఫిదాయిన్లు దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపాడు.
షహీద్ కావడమే వారి లక్ష్యం
ఎప్పుడెప్పుడు ఇండియాలోకి చొరబడి దాడులు చేద్దామా? అని సూసైడ్ బాంబర్లంతా తనపై ఒత్తిడి తెస్తున్నట్లు మసూద్ అజర్ పేర్కొన్నాడు. ‘‘మా వాళ్లు కార్లు, బంగ్లాలు, వీసాలు లేదా డబ్బులు ఆశించడం లేదు. వాళ్లకు కేవలం ‘షహీద్’ అవ్వడమే లక్ష్యం. వాళ్లను కంట్రోల్ చేయడం నా వల్ల కావడం లేదు. ఇండియాలోకి చొరబడతామని అంటున్నరు’’అని మసూద్ అజర్ అన్నాడు.
