బొగ్గును కల్తీ చేస్తున్రు..హైగ్రేడ్ బొగ్గులో నాసిరకం మిక్స్

బొగ్గును కల్తీ చేస్తున్రు..హైగ్రేడ్ బొగ్గులో నాసిరకం మిక్స్

వెలుగు: బొగ్గు మాఫియా గుట్టురట్టయింది. రంగారెడ్డిజిల్లాలో ని ఇబ్రహీంపట్నం అడ్డాగా కల్తీ దందా చేస్తున్న 8 మంది సభ్యుల ముఠాను రాచకొండ ఎస్‌‌‌‌ఓటీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిం దితుల నుంచి రూ.2.5 లక్షల క్యాష్‌తో పాటు 1,050 టన్నుల హైగ్రేడ్ బొగ్గు,700 టన్నుల బొగ్గుపొడి, రెండు లారీలు, రెండు జేసీబీలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం రూ.1.63 కోట్లుఉంటుందని సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. రంగారెడ్డిజిల్లా వనస్థలిపురం హస్తినాపురంలోని వెంకటరమణ కాలనీకి చెందిన గుండె రాజు(38) బొగ్గువ్యాపారం చేస్తున్నాడు. 2018లో శ్రీవెంకటేశ్వర ట్రేడర్స్‌‌‌‌యూనిట్‌‌‌‌పేరుతో కోల్‌‌‌‌ ట్రేడర్స్‌ ‌‌‌స్టార్ట్‌‌‌‌చేశాడు. ఇబ్రహీంపట్నం రామ్‌‌‌‌దాస్‌‌‌‌ పల్లికి చెందిన రామ్‌‌‌‌రెడ్డి వ్యవసాయ భూమిలో బొగ్గుడంపింగ్ యార్డును ఏర్పాటు చేశాడు. బొగ్గు వ్యాపారంలో అనుభవమున్న అమీర్ మహ్మద్ తో కలిసి బొగ్గును కల్తీ చేసి అమ్మేందుకు ప్లాన్ చేశాడు. డంపింగ్ యార్డులో సింగరేణి కాలరీస్ తో పాటు కృష్ణపట్నం పోర్టు మీదుగా రాష్ట్రంలో కి సప్లయ్ అయ్యేసౌతాఫ్రికా, ఆస్ట్రేలియా బొగ్గును కల్తీ చేసేవాడు.

ఇట్ల కల్తీ చేస్తున్రు…

రాజు లారీల ఓనర్లు, డ్రైవర్లతో కుమ్మక్కయి ఈదందా కు తెరతీశాడు. కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్‌‌‌‌తో పాటు కృష్ణపట్నం పోర్టు నుంచి బొగ్గు లోడ్లతో బయలుదేరిన లారీలను అన్ లోడ్ కావాల్సిన ప్రాంతాలకు కాకుండా, తన డంపింగ్‌‌‌‌యార్డుకు తరలించేవారు. అక్కడ లారీల్లోని హైగ్రేడ్‌ ‌‌‌క్వాలిటీ బొగ్గును కొంత వరకు అన్ లోడ్ చేసి, అందులో నాసిరకం బొగ్గును మిక్స్ చేసేవారు. బరువులో ఎలాంటి తేడా లేకుండా చూసి, కంపెనీలకు సప్లయ్ చేసేవారు. ఇందుకోసం లారీ ఓనర్లు, డ్రైవర్లకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు ఇచ్చేవారు. ఇలా తమకు తెలిసిన కంపెనీల యజమానులకు తక్కువ ధరలో కల్తీ బొగ్గును సప్లయ్‌‌‌‌ చేస్తూ మోసాలకు పాల్పడ్డా రు. ఈ ముఠా గ్రేటర్ సిటీ, శివారు ప్రాంతాల్లోని కెమికల్‌‌‌‌ కంపెనీలు, ఇటుక బట్టీలకు బొగ్గు సప్లయ్‌‌‌‌ చేస్తోంది. బొగ్గు కల్తీపై సమాచారం అందుకున్న ఎల్బీనగర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ఓటీ పోలీసులు రాజు దందాపై నిఘా పెట్టారు. కృష్ణపట్నం పోర్టు నుంచి వచ్చిన టీఎస్‌‌‌‌05 యూఏ 6788 లారీతో పాటు, సింగరేణి కాలరీస్‌‌‌‌నుంచి వచ్చిన హైగ్రేడ్ బొగ్గును మిక్సింగ్‌‌‌‌ చేసేందుకు ప్రయత్నించి న రాజు గ్యాం గ్ ను పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు.

ఇది ముఠా..

నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా గుర్రంగూడకు చెందిన తన స్నేహితుడు ఉత్తంపల్లి లక్ష్మణ్‌‌‌‌(38)ను సూపర్‌‌‌‌‌‌‌‌వైజర్‌‌‌‌‌‌‌‌గా నియమించాడు. అదే జిల్లాలోని చెమొంపల్లి తండాకు చెందిన కత్రవత్‌‌‌‌ సోమ (33), మరో వ్యక్తి ఎరుకల అంజయ్య (50) డంపింగ్ యార్డు దగ్గర పని చేస్తున్నారు. హస్తినాపురానికి చెందిన లారీల ఓనర్లు చల్లా అమరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్ డి(33), కరుణాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లికి చెందిన లారీ డ్రైవర్లుకుర్తల మల్లేష్‌ (27), సగరాలసత్యం(28), జేసీబీ ఆపరేటర్లునిజాముద్దీన్‌‌‌‌ (25), రిజ్వన్‌‌‌‌(20), గగన్‌‌‌‌పహడ్‌‌‌‌కు చెందిన అమీర్‌‌‌‌‌‌‌‌మహ్మద్, ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌వ్యాపారం చేసే పురుషోత్తం రెడ్డి(57)తో కలిసి గుండె రాజు దందా చేస్తున్నాడు.