ఘట్కేసర్ వెలుగు : తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఘట్ కేసర్ సీఐ సైదులు తెలిపిన ప్రకారం.. మున్సిపాలిటీ పరిధి బాలాజీనగర్ సన్ రైజ్ అనెక్స్ లో ఉండే రాజ్ కుమార్, దీపాన్విత దంపతులు బుధవారం మధ్యాహ్నం పీర్జాదిగూడలోని అద్దె ఇంటికి వెళ్లారు.
గురువారం ఉదయం వచ్చి చూడగా ఇంటి గేటు తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లగా మెయిన్ డోర్ సెంట్రల్ సిస్టమ్ లాక్ ధ్వంసం చేసి బెడ్రూమ్ బీరువాలోని 8 తులాల బంగారు ఆభరణాలు, వెండి పల్లెం చోరీ ఎత్తుకెళ్లారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
