ఎనిమిదేళ్ల బాలుడి పెద్ద మనసు: పేదల కోసం పిగ్గీ బ్యాంక్‌ సేవింగ్స్‌

ఎనిమిదేళ్ల బాలుడి పెద్ద మనసు: పేదల కోసం పిగ్గీ బ్యాంక్‌ సేవింగ్స్‌

భటిండా : లాక్ డౌన్‌ వల్ల ఇబ్బంది పడుతున్న పేద ప్రజల కోసం చాలామంది స్వయంగా ముందుకొచ్చి చేతనైన సాయం చేసి వారికి అండగా నిలుస్తున్నారు. పంజాబ్ కు చెందిన ఓ ఎనిమిదేళ్ల బాలుడు పిగ్గీ బ్యాంక్ లో తాను కూడబెట్టిన డబ్బును పేద పిల్లలకు ఇచ్చి తన పెద్ద మనసు చాటుకున్నాడు.

పంజాబ్‌లోని భటిండా ప్రాంతానికి చెందిన ప్రీతిందర్‌ సింగ్‌ తన పిగ్గీ బ్యాంక్‌లో రూ.7500 పోగు చేశాడు. ఈ మొత్తాన్ని నిరుపేద పిల్లల ఆహారం కోసం ఖర్చు చేయాలని కోరుతూ స్థానిక ఎస్‌ఎస్పీ నానక్‌ సింగ్ కు శుక్రవారం డబ్బు అందజేశాడు. ప్రీతిందర్‌ అందరిలోనూ స్ఫూర్తి నింపాడని ఎన్‌ఎస్పీ నానక్‌ మెచ్చుకున్నారు.