హాస్పిటల్ లో 80 మంది సిబ్బందికి కరోనా

హాస్పిటల్ లో 80 మంది సిబ్బందికి కరోనా

న్యూఢిల్లీ: ఢిల్లీలోని సరోజ్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ఒక్క నెలలోనే 80 మంది మెడికల్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది, డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. డాక్టర్‌‌‌‌‌‌‌‌ ఏకే రావత్‌‌‌‌‌‌‌‌(58) ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పొందుతూ శనివారం మరణించారు. ఈ విషయాన్ని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ మెడికల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ పీకే భరద్వాజ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. రావత్‌‌‌‌‌‌‌‌ వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ కూడా వేయించుకున్నారు. పేషెంట్లు పెరుగుతున్నారని, ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ సరిపోవట్లేదంటూ సరోజ్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ గత నెలలో హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేసింది. సరిపడా ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ అందించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంది. కాగా ప్రస్తుతం ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ సరఫరా మెరుగుపడిందని భరద్వాజ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.