అధికారుల తప్పిదంతో 800 మంది ఎగ్జామ్స్​ రాయలే

అధికారుల తప్పిదంతో 800 మంది ఎగ్జామ్స్​ రాయలే

నాంపల్లి, వెలుగు: అధికారుల తప్పిదం కారణంగా 800 మంది ఎగ్జామ్స్​రాయలేకపోయారని పాలిటెక్నిక్​స్టూడెంట్లు ఆరోపించారు. గురువారం నాంపల్లిలోని టెక్నికల్​ఎడ్యుకేషన్ డైరెక్టర్​ఆఫీసు ముందు ఆందోళనకు దిగారు. అధికారులను కలిసేందుకు పోలీసులు లోనికి అనుమతించకపోవడంతో గేటు ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అటెండెన్స్​తక్కువగా ఉందని, కాలేజీలో కండోనేషన్​ఫీజు కట్టించుకున్నారని చెప్పారు. తీరా ఎగ్జామ్స్​టైమ్​కు హాల్​టికెట్లు రాలేదన్నారని వాపోయారు. ఇప్పటికే మూడు ఎగ్జామ్స్ అయిపోయాయని కన్నీరు పెట్టుకున్నారు. తమ కంటే తక్కువ అటెండెన్స్ ఉన్న స్టూడెంట్లను ఎగ్జామ్స్ కు అనుమతించారని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని, దాదాపు 800 మంది నష్టపోతున్నారని చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించి తమను పై తరగతులకు ప్రమోట్ చేయాలని, బ్యాక్ లాగ్ ల కింద ఎగ్జామ్స్​రాసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఆందోళన విషయం తెలుసుకున్న అసిస్టెంట్ డెరెక్టర్​అక్కడికి చేరుకుని స్టూడెంట్లతో మాట్లాడారు. కమిషనర్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.