- నేడు సాయంత్రం 5 గంటలకు ముగియనున్న నామినేషన్ గడువు
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండో రోజు గురువారం అభ్యర్థుల నుంచి భారీ సంఖ్యలో నామినేషన్లు వచ్చా యి. రాష్ట్ర వ్యాప్తంగా 7,980 మంది అభ్యర్థుల నుంచి 8,326 నామినేషన్లు స్వీకరించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని ప్రకటించారు. వీటిలో అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 3,379 నామినేషన్లు వచ్చాయని ఎన్నికల అధికారులు తెలిపారు.
బీఆర్ఎస్ నుంచి 2,506, బీజేపీ నుంచి 1,709, అప్ నుంచి 17, బీఎస్పీ 142, సీపీఐ (ఎం) 88, ఎంఐఎం 166, టీడీపీ నుంచి 10, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల నుంచి 141, ఇండిపెండెంట్ అభ్యర్థులు 918 నామినేషన్లు వేసినట్లు ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని ప్రకటించారు. మొదటి, రెండో రోజు కలిపి ఇప్పటి వరకు 9,276 నామినేషన్లు వచ్చినట్లుగా పేర్కొన్నారు. శుక్రవారం నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు వస్తారని ఎన్నికల సంఘం ప్రకటించింది.
