85 కోట్లమంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు

 85 కోట్లమంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు

కిడ్నీలు ఫిల్టర్‌‌‌‌లా పనిచేసి, శరీరంలో సోడియం, ఫాస్పరస్‌‌, పొటాషియంలాంటి మినరల్స్‌‌ని బ్యాలెన్స్‌‌డ్‌‌గా ఉంచుతాయి. ఈ మధ్య లైఫ్‌‌స్టైల్‌‌లో వచ్చిన మార్పులవల్ల కిడ్నీలు దెబ్బతిని చాలామంది రోగాల బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 కోట్లమంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని చెప్తోంది డబ్ల్యూహెచ్‌‌వో. లైఫ్‌‌స్టైల్‌‌లో ఈ చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా  కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని చెప్తున్నారు హెల్త్‌‌ ఎక్స్‌‌పర్ట్స్‌‌. 

ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ అనేది కండరాల పెరుగుదలకే కాదు, బీపీ కంట్రోల్‌‌లో ఉంచి గుండె సమస్యలను దూరం చేయడానికి, కొలెస్ట్రాల్ తగ్గించి డయాబెటిస్‌‌ రానీయకుండా చేయడానికి సాయపడుతుంది. ఎక్సర్‌‌‌‌సైజ్‌‌చేయడం వల్ల కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే రోజూ ఏదో ఒక ఫిజికల్‌‌ యాక్టివిటీ తప్పకుండా చేయాలి. కిడ్నీలు శరీరంలో ఉన్న ద్రవాల నుంచి  చెత్తను తొలగిస్తాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ నీళ్లు తాగాలి. ఎప్పుడూ హైడ్రేటెడ్‌‌గా ఉండాలి. రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్లు వచ్చే అవకాశం తగ్గుతుంది.శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీల పాత్ర ముఖ్యమైంది. చెడు ఆహారపు అలవాట్ల వల్ల బీపీ, ఊబకాయం, డయాబెటిస్‌‌తో పాటు కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఎక్కువగా పండ్లు, కూరగాయలు, పప్పులాంటి న్యూట్రిషన్‌‌ ఫుడ్‌‌ తినాలి. 

నెగెటివ్‌‌ ఆలోచనలతో కాకుండా 

ఎప్పుడూ పాజిటివ్‌‌గా ఉండాలి. మెంటల్‌‌ స్ట్రెస్‌‌ కూడా కిడ్నీల ఫెయిల్యూర్‌‌‌‌కి ఒక కారణం. అందుకే స్ట్రెస్‌‌ తగ్గించు కోవడానికి యోగా, మెడిటేషన్‌‌ చేయాలి. ఎప్పుడూ హెల్తీ ఫుడ్‌‌ తింటే ఆరోగ్యంగా ఉంటారు.ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలకు  రక్త సరఫరా జరగకుండా పొగాకు బ్లాక్‌‌ చేస్తుంది. పొగాకులో ఉండే నికోటిన్‌‌, ఇతర కెమికల్స్‌‌ రక్తంలో కలిసి క్యాన్సర్‌‌‌‌కు కారణం అవుతుంది. అందుకే సిగరెట్లకు దూరంగా ఉండాలి.  కొందరు ప్రతీ చిన్న ప్రాబ్లమ్‌‌కి ట్యాబ్లెట్స్‌‌ వేసుకుంటారు. ప్రొటీన్‌‌, విటమిన్స్‌‌ని రకరకాల సప్లిమెంట్స్‌‌ రూపంలో తీసు కుంటుం టారు. దీనివల్ల కూడా కిడ్నీలు దెబ్బతినే  ప్రమాదం ఉంది. అందుకే డాక్టర్‌‌‌‌ రికమండేషన్‌‌ లేకుండా ఎలాంటి మందులు, సప్లిమెంట్స్‌‌ వాడొద్దు.