63 అడుగుల గణపతికి... 86 అడుగుల కండువా...

63 అడుగుల  గణపతికి... 86 అడుగుల కండువా...

ఖైరతాబాద్‌ లో  ప్రతిష్టించే 63 అడుగుల మహాగణపతికి ఈసారి కూడా 86 అడుగుల కండువా, జంధ్యం, పట్టు వస్త్రాలను భక్తులు సమర్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.  40 రోజుల పాటు నైపుణ్యం కలిగిన కళాకారుల చేత వీటిని తయారుచేయించినట్లు తెలిపారు. వినాయకచవితి రోజు ఉదయం 7 గంటలకు రాజ్‌దూత్‌ చౌరస్తా నుంచి కళాకారుల బృందంతో ఊరేగింపుగా వచ్చి స్వామివారికి సమర్పించనున్నారు.

గణేష్ నవరాత్రుల్లో ఖైరతాబాద్ మహా వినాయకుడికి చేసే ప్రతిది ఎంతో ప్రతిష్టాత్మకమే. వేలాదిగా భక్తులు వచ్చి దర్శించుకునే బొజ్జ గణపయ్యను ప్రత్యేకంగా అలంకరిస్తారు. దాని లడ్డూను కూడా ప్రత్యేకంగా తయారు చేయించి తీసుకొని వస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ వినాయకుడి మెడలో ఉండే అతిపెద్ద కండువాకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. దీన్ని నిర్వాహకులు ప్రత్యేకంగా మగ్గంపై నేయించి విగ్రహ ప్రతిష్టాపన రోజున ఊరేగింపుగా తీసుకువచ్చి మెడలో వేస్తారు