- బడ్జెట్ రెండో సెషన్ మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు: కేంద్ర మంత్రి రిజిజు
తవాంగ్: లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లాను తొలగించే అవిశ్వాస తీర్మానంపై మార్చి 9న చర్చ జరగనుంది, ఆ తర్వాత ఓటింగ్ ఉంటుంది. బడ్జెట్ సమావేశాల రెండో విడత ప్రారంభమైన రోజునే ఇది ఉంటుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఆదివారం అరుణాచల్‌ప్రదేశ్‌లోని తన నియోజకవర్గం తవాంగ్‌లో పర్యటించిన రిజిజు మీడియాతో మాట్లాడారు.
బడ్జెట్ సెషన్ రెండో భాగం మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు ఉంటుందన్నారు. రెండో సెషన్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని.. పలు బిల్లులతో పాటు ఒక కీలక బిల్లు పార్లమెంట్‌లో చర్చకు వస్తుందన్నారు. ప్రతిపక్షాలు మొదటి సెషన్లోలా నిరసనలు చేస్తే, అది వారికే నష్టమన్నారు. ప్రతిపక్షాలు హౌస్ నడవనివ్వకపోతే, గిలటిన్ పద్ధతిలో ముందుకు వెళ్తామని రిజిజు చెప్పారు. ప్రతిపక్షాలలో ఐక్యత లేదని పేర్కొన్నారు.
