86 ఏళ్ల వయసులో వృద్ధుడి శీర్షాసనం.. గిన్సీస్‭లో చోటు

86 ఏళ్ల వయసులో వృద్ధుడి శీర్షాసనం.. గిన్సీస్‭లో చోటు

ఒడిశాలోని రవుర్కెలాలో 86 ఏళ్ల వృద్ధుడు 6 నిమిషాల 36 సెకన్ల పాటు శీర్షాసనం వేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్‭లో స్థానం సంపాదించాడు. కోయెల్ నగర్ ప్రాంతానికి చెందిన ఈశ్వర్ నాథ్ గుప్తా కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో శిర్షాసన ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఇంతకుముందు, కెనడాకు చెందిన 74 ఏళ్ల రిచర్డ్‌ డీ పేరిట ఈ రికార్డు ఉండేది. ఇప్పుడు ఈశ్వర్ నాథ్ గుప్తా కోయెల్ నగర్ వాసులను గర్వించేలా చేశాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఈశ్వర్ నాథ్ కృషి, అంకితభావాన్ని ప్రశంసించారు.