హైదరాబాద్, వెలుగు: రెండేండ్ల బీఈడీ కోర్సులో అడ్మిషన్ల కోసం గురువారం జరిగిన టీఎస్ ఎడ్ సెట్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 79 పరీక్షా కేంద్రాల్లో.. రెండు సెషన్లలో ఎగ్జామ్ జరిగిందని టీఎస్ ఎడ్ సెట్ కన్వీనర్ మృణాళిని తెలిపారు. మొత్తం 33,879 మందికి గానూ 29,463 మంది స్టూడెంట్లు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. మార్నింగ్ సెషన్ లో 16,321 మందికి 14,633 మంది.. మధ్యాహ్నం సెషన్ లో 16,950 మందికి గానూ 14,830 మంది అటెండ్ అయ్యారని చెప్పారు.
