కస్తూర్బా రెసిడెన్షియల్ లో ఆ..89 మంది విద్యార్థులు ఎక్కడ పోయారు..

కస్తూర్బా రెసిడెన్షియల్ లో ఆ..89 మంది విద్యార్థులు ఎక్కడ పోయారు..

ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాలో 89 మంది విద్యార్థినులు అదృశ్యం కలకలం రేపింది. తనిఖీలకు వచ్చిన అధికాలురు హాస్టల్ విద్యార్థుల హాజరు రిజిస్టర్ చూసి అవాక్కయ్యారు. హాస్టల్లో 100 మంది విద్యార్థినులు ఉంటే.. హాజరు 100శాతం రిజిస్టర్ లో ఉన్నా.. అక్కడ ఉన్నది మాత్రం కేవలం 11 మంది మాత్రమే.. ఈ ఘటన గోండా జిల్లాలోని కస్తూర్బా రెసిడెన్షియల్ స్కూల్ లో సరస్ పూర్ కస్తూర్బా గాంధీ బాలిక రెసిడెన్షియల్ హాస్టల్ లో జరిగింది.  

సోమవారం అర్థరాత్రి  కస్తూర్బా గాందఈ రెసిడెన్షియల్ స్కూల్లో తనిఖీ చేశారు జిల్లా మేజిస్ట్రేట్ నేహా శర్మ... పాఠశాల గందరగోళ పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయారు.  తనిఖీలో పాఠశాలలో మొత్తం 100 మంది బాలికలకు 11 మంది మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన 89 మంది బాలికలకు సంబంధించి హాస్టల్ వార్డెన్ సరితా సింగ్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఆగస్టు17 తర్వాత హాజరు రిజిస్టర్‌లో 7 ,8 తరగతుల బాలికల ఉనికిని నమోదు చేయలేదు..అయితే ప్రేరణ పోర్టల్‌లో మాత్రం వార్డెన్ నకిలీ హాజరును నమోదు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఆరా తీయగా.. ఆగస్టు 19 న అదృశ్యం అయినవారు 21న ఇంటికి చేరినట్లు తెలిపారు. 

కస్తూర్బా హాస్టల్ లో జరిగిన అవకతకవలు,  విద్యా్ర్థుల మిస్సింగ్ నిర్లక్ష్యానికి కారణమైన హాస్టల్ వార్డెన్ తో సహా నలుగురిపై కేసు పెట్టారు.