2024 Tech layoffs: 89 శాతం ఐటీ ఉద్యోగుల్లో లేఆఫ్స్ భయం..అధ్యయనాల్లో వెల్లడి

2024 Tech layoffs: 89 శాతం ఐటీ ఉద్యోగుల్లో లేఆఫ్స్ భయం..అధ్యయనాల్లో వెల్లడి

టెక్ ఇండస్ట్రీలో ఉద్యోగాల తొలగింపుల పరంపర కొనసాగుతోంది. 2024లో మరింత పెరుగుతాయని..పెద్దపెద్ద టెక్ కార్పొరేషన్ల నుంచి స్టార్టప్ కంపెనీల వరకు అన్నిస్థాయిల్లో తొలగింపులతో లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డు పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. 2024 మొదటి రెండు నెలల్లో 193 కంపెనీలు దాదాపు 50 వేల మంది సిబ్బందిని తొలగించాయి. మార్చి 2024 మొదటి వారంలో ఏడు కంపెనీలు 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. కంపెనీలు సంస్థాగత నిర్మాణం, కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు, టెక్ రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు తొలగింపులు చేపడుతున్నామని కంపెనీలు చెబుతున్నాయి. దీంతో మిలియన్ల కొద్దీ టెక్ నిపుణులు తమ ఉద్యోగాలు ఉంటాయో..ఊడుతాయో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఐటీ ప్రొఫెషనల్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 

అథారిటీ హ్యాకర్ తాజా నివేదిక ప్రకారం..54.58శాతం ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఐటీ సేవలు, డేటా, సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ లో పనిచేస్తున్న నిపుణులు ఉద్యోగ భద్రతకు సంబంధించిన ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని నివేదిక పేర్కొంది. 

ఉద్యోగాలపై AI ప్రభావం 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ వేగంగా పెరగడం కూడా ప్రధానంగా ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. సర్వేల ప్రకారం.. 72.42 శాతం మంది టెక్ ఉద్యోగులు రాబోయే ఐదేళ్లలో తమ ఉద్యోగాలపై AI ప్రభావం గురించి ఆందోళన చెందుతున్నట్లు అంగీకరించారు. దాదాపు సగం మంది ఉద్యోగులపై AI  ప్రభావం చూపుతుందని .. వారిలో సీ లెవెల్స్ ఎగ్జిక్యూటివ్ లు 85 శాతం.. డైరెక్టర్లు 78.83 శాతం ఉన్నారు. 

ముందున్న మార్గం

అయితే AI మోడల్స్ తో ఉద్యోగాల తొలగింపులతో పాటు కొత్త ఉద్యోగాల సృష్టి కూడా ఉంటుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఇటీవల  ఓ నివేదికలో తెలిపింది. 2025 నాటికి AI తో 97 మిలియన్ల కొత్త ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని అంచనా వేసింది.
 
AI వేవ్ ను తట్టుకోవాలంటే.. రోజువారీ కార్యక్రమాల్లో AI సాధనాలను చేర్చడం, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొంచుకోవడం, వృత్తిపరమైన నెట్ వర్క్ ను పెంపొందించడం, స్పెషల్ స్కిల్స్, పర్సనల్ బ్రాండింగ్ కీలకమని నివేదిక పేర్కొంది. నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు చాలామంది ఎగ్జిక్యూటివ్ లు ఉద్యోగాలను వదిలేకంటే AI స్కిల్స్ నేర్చుకోవడం బెటర్ అని నిర్ణయానికి వస్తున్నారు.