మల్కాజిగిరి, వెలుగు: పశువుల రవాణాదారులు, పోలీసులపై దాడికి పాల్పడిన ఘటనలో 9 మంది నిందితులను సరూర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. మే 11న అర్ధరాత్రి పురానీ హవేలీలో సినిమా షూటింగ్ కోసం 8 ఎడ్లను డీసీఎం వాహనంలో తరలిస్తుండగా, వధశాలకు తీసుకెళ్తున్నారనే అనుమానంతో కొత్తపేట వద్ద కొందరు వ్యక్తులు వాహనాన్ని అడ్డుకుని దాడికి దిగారు.
సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులపై కూడా నిందితులు రాళ్లతో దాడి చేయడంతో ఇన్స్పెక్టర్తో పాటు పలువురు సిబ్బంది గాయపడగా, పోలీసు వాహనం ధ్వంసమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేశారు.
పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. పశువుల రవాణాపై అనుమానాలు ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
