
వరుస సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన శైలిని చాటుతున్న ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్… తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని చెప్పడమే కాదు… చేతల్లో కూడా చేసి చూపించారు. తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. రేపటి(గురువారం) నుంచి వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా విద్యుత్ శాఖ అధికారులకు సీఎం గజన్ ఆదేశాలు జారీ చేశారు.. విద్యుత్ సరఫరాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 60 శాతం ఫీడర్లలో పంపుసెట్లకు పగటిపూట ఉచిత విద్యుత్ అమలు చేయాలన్నారు. మిగతా 40 శాతం ఫీడర్లలో పనులకు రూ.1700 కోట్లు విడుదల చేశారు. ఫీడర్లలో పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.