రాష్ట్రానికి 9 మంది కొత్త ఐఏఎస్‌‌లు

రాష్ట్రానికి 9 మంది కొత్త ఐఏఎస్‌‌లు

25 రాష్ట్రాలకు 179 మంది ఆఫీసర్ల కేటాయింపు.. డీవోపీటీ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి కొత్తగా 9 మంది ఐఏఎస్ ఆఫీసర్లు రానున్నారు. 2019 బ్యాచ్ కు చెందిన 9 మంది ఐఏఎస్ లను రాష్ట్రానికి కేటాయిస్తూ శుక్రవారం డీవోపీటీ (డిపార్ట్ మెంట్ ఆఫ్​పర్సనల్ అండ్ ట్రెయినింగ్) ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం179 మంది ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను 25 రాష్ట్రాలకు కేంద్రం కేటాయించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల సీఎస్ లకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణకు కేటాయించిన అధికారులలో మయాంక్ మిట్టల్ (యూపీ), అభిషేక్ అగస్త్య (జమ్మూ కాశ్మీర్), అపూర్వ్ చౌహాన్ (యూపీ),  మంద మకరంద (తెలంగాణ),  అశ్విని తానాజీ వాకడే (మహారాష్ట్ర), బి. రాహుల్ (తెలంగాణ), ప్రతిభా సింగ్ (రాజస్థాన్), ప్రఫుల్ దేశాయ్ (కర్నాటక), పి. కదిరవన్ (తమిళనాడు) ఉన్నారు. మన రాష్ట్రానికి చెందిన పి. ధాత్రి రెడ్డిని ఒడిశాకు, కట్టా రవితేజను, బానోతు మృగేందర్ లాల్ ను తమిళనాడుకు కేటాయించారు.

ఇవీ చదవండి

పోషక విలువలున్నాయని ఎక్కువగా తింటే..

జూనియర్ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్: సామియా @ వరల్డ్‌ నెంబర్-2

నెట్ బౌలర్‌గా వెళ్లి 3 ఫార్మాట్లలో అరంగేట్రం

లాండ్​లైన్​ నుంచి మొబైల్​కు కాల్​ చేయాలంటే ఇలా చేయాల్సిందే!