కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్లు..9 మంది సైనికులు మృతి

కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్లు..9 మంది సైనికులు మృతి

అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో విషాదం నెలకొంది. మార్చి 30 మధ్యాహ్నం జరిగిన  హెలికాప్టర్ ప్రమాదంలో 9 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సైన్యానికి చెందిన రెండు HH-60 బ్లాక్హాక్ హెలికాప్టర్ లో సైనికులు ట్రైనింగ్ తీసుకుంటుండగా సడెన్ గా  హెలికాప్టర్లు కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు.అయితే హెలికాప్టర్లు కూలడానికి  గల కారణాలు తెల్వాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

ఫోర్ట్ క్యాంప్‌బెల్‌కు వాయువ్యంగా కెంటుకీలోని ట్రిగ్ కౌంటీలో మార్చి 29వ తేదీ  బుధవారం రాత్రి 10:00 గంటలకు (0300 GMT) క్రాష్  జరిగిందని  తెలిపారు అధికారులు. "క్రాష్ ఒక పొలంలో,  కొంత అటవీ ప్రాంతంలో జరిగిందని కెంటకీ స్టేట్ పోలీస్ ట్రూపర్ సారా బర్గెస్  తెలిపారు.   కుప్పకూలే ముందు రెండు హెలికాప్టర్లు తన ఇంటి మీదుగా ఎగురుతున్నట్లు తాను చూశానని క్రాష్ జరిగిన ప్రదేశానికి ఒక మైలు దూరంలో నివసిస్తున్న నిక్ టోమాస్జెవ్‌స్కీ  అనే వ్యక్తి   చెప్పాడు.