బల్దియా హెడ్డాఫీసులో యూపీ అధికారుల టీమ్

బల్దియా హెడ్డాఫీసులో యూపీ అధికారుల టీమ్
  •     డీఆర్ఎఫ్ పనితీరు, ఎస్ఎన్డీపీ పనులపై స్టడీ

హైదరాబాద్, వెలుగు : ఉత్తరప్రదేశ్​కు చెందిన 9 మంది అధికారుల బృందం గురువారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసును సందర్శించింది. ఈవీడీఎంలోని డీఆర్ఎఫ్ బృందాల పనితీరు, జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్ఎన్డీపీ పనులతో పాటు వ్యర్థాల నిర్వహణ విధానాలపై ఈ బృందం స్టడీ చేయనుంది. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి యూపీ బృందానికి స్వాగతం పలికారు. అనంతరం ఈవీడీఎం కంట్రోల్ రూమ్, డీఆర్ఎఫ్  బృందాల పనితీరును యూపీ అధికారులకు వివరించారు. బల్దియా డీఆర్ఎఫ్ చేపడుతున్న సహాయక చర్యలపై డెమో ప్రదర్శించారు.

డీఆర్ఎఫ్ వెహికల్స్, వాటిలో ఉన్న వివిధ రకాల మెషీన్లు, డ్రోన్ కెమెరా మొదలైన వాటిని చూపించారు. ఆ తర్వాత యూపీ అధికారులు సంజీవయ్య పార్కు సమీపంలోని ట్రాన్స్​ఫర్ స్టేషన్​ను పరిశీలించారు. అధికారుల బృందంలో  యూపీ స్టేట్ రెవెన్యూ డిపార్ట్ మెంట్(డిజాస్టర్ మేనేజ్ మెంట్) అడిషనల్ చీఫ్ సెక్రటరీ సుధీర్ గార్గ్, యూపీఎస్డీఎంఏ వైస్ చైర్మన్ రవీంద్ర ప్రతాప్ సాహి, వారణాసి మున్సిపల్ కమిషనర్ సీపు గిరి, గోరఖ్ పూర్ మున్సిపల్ కమిషనర్ గౌరవ్ సింగ్, మున్సిపల్ చీఫ్ ఇంజినీర్ సంజయ్ చౌహాన్, ఘజియాబాద్ మున్సిపల్ కమిషనర్ విక్రమాదిత్య, లక్నో మున్సిపల్ కమిషనర్ ఇంద్రజిత్ సింగ్, అడిషనల్ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అరవింద్ రావు, ఇంజనీర్ ఎక్స్ పర్ట్ ఆశిశ్ శర్మ ఉన్నారు.