హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై పైప్ లైన్ పగిలి.. తాటి చెట్లపైకి ఎగసిపడుతున్న నీళ్లు..

హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై పైప్ లైన్ పగిలి.. తాటి చెట్లపైకి ఎగసిపడుతున్న నీళ్లు..

హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై పైప్ లైన్ పగిలి పెద్ద ఎత్తున మంచి నీరు వృధాగా పోతున్నాయి.. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ కు వాటర్ సప్లై చేసే ఈ పైప్ లైన్ మిగలడంతో భారీగా నీళ్లు ఎగసి పడుతున్నాయి. తాటి చెట్లపైకి నీళ్లు ఎగసి పడుతుండటంతో నీళ్ల దాటికి చెట్లు నేలకొరిగాయి. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం జగ్గయ్య పల్లె శివారులో ఉన్న హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై పైప్ లైన్ పగిలింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ కు మంచి నీరు అందించే ఈ పైప్ లైన్ పగలడంతో పెద్ద ఎత్తున నీరు వృధా అవుతున్నాయి. ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. 

స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు మోటార్లు ఆఫ్ చేసి నీటి ఉదృతి తగ్గించారు.పైప్ లైన్ పగలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పగిలిన పైప్ లైన్ త్వరగా రిపేర్ చేయాలని కోరుతున్నారు స్థానికులు.