Healthy Breakfast: ఫ్రూట్ సలాడ్.. కమ్మనైన బ్రేక్ ఫాస్ట్.. చాలా ఈజీ ..సూపర్ టేస్ట్..

 Healthy Breakfast:  ఫ్రూట్ సలాడ్.. కమ్మనైన బ్రేక్ ఫాస్ట్..   చాలా ఈజీ ..సూపర్ టేస్ట్..

ఇడ్లీ.. దోశె.. పూరీలను.. బ్రేక్ చేస్తూ.. సలాడ్స్.. స్పగెట్టీ, పాస్తాలతో బ్రేక్ ఫాస్ట్ ట్రై చేయండి. యమ్మీ రుచులతో పిల్లలను ఆకట్టుకుని..హెల్దీ బ్రేక్ ఫాస్ట్​ను అందించండి. ఇప్పుడు వాటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. . .! 

కీరదోసకాయ.. టొమాటో క్రిమీ సలాడ్​ తయారీకి కావలసినవి

  • అలివ్ నూనె: 1 టేబుల్ స్పూన్
  • ఉల్లిపాయ తరుగు: ఒక కప్పు
  • టొమాటో తరుగు: మూడు కప్పులు
  • కీర దోసకాయ ముక్కలు: రెండు కప్పులు
  • చక్కెర :1 కప్పు
  • వెనిగర్: 1 టీ స్పూన్
  • సోంపు పొడి :అర టీ స్పూన్
  • మిరియాల పొడి :1 టీ స్పూన్
  • ఉప్పు: 1 టీ స్పూన్
  • కొత్తిమీర తరుగు: అర కప్పు

తయారీ ఇలా..

  •  గిన్నెలోనె వెనిగర్, సోంపు పొడి, చక్కెర, మిరియాల పొడి, ఉప్పు చిక్కగా కలపాలి.
  • ఉల్లిపాయను సన్నగా నిలువుగా తరగాలి. వాటిని గుండ్రంగా కోసిన టొమాటో, కుకుంబర్ ముక్కలతో గిన్నెలో కలపాలి. పైన క్రీం వేసి ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి.
  •  తర్వాత ముక్కలపై ముందు కలిపి ఉంచిన ద్రవాన్ని పోసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని తినాలి.. అంతే సూపర్​ టేస్ట్​..! 

యాపిల్​.. క్రాన్​ బెర్రీ.. వాల్​ నట్​ సలాడ్​ తయారీకి కావలసినవి

  • తరిగిన పాలకూర : ఒక కప్పు
  • రెడ్ యాపిల్ ముక్కలు - 1 కప్పు
  • గ్రీన్ యాపిల్ ముక్కలు 1 కప్పు
  • వాల్ నట్ పొడి: 1 కప్పు
  • డ్రాన్ బెర్రీ: 1 కప్పు
  • అలివ్ నూనె: 2 టీ స్పూన్లు
  • చీజ్ తరుగు : అర కప్పు
  • యాపిల్ జ్యూస్: 2 టీ స్పూన్లు
  • యాపిల్​ సిడార్​ వెనిగర్​: 1 టీ స్పూన్​
  • తేనె: 2 టీ స్పూన్లు
  • చక్కెర : ఒక కప్పు
  • వెనిగర్​ : 4 టీ స్పూన్లు
  • మిరియాలపొడి : 1 టీ స్పూన్
  • ఉప్పు : 1 టీ స్పూన్

తయారీ విధానం 

 

  •  తరిగిన పాలకూర, రెడ్. యాపిల్, గ్రీన్ యాపిల్ ముక్కలు, వాల్​నట్ పొడి, చీజ్ తరుగు, డ్రాన్​  బెర్రీ, చక్కెర ఒక గిన్నెలో వేసి కలపాలి.
  •  మరొక గిన్నెలో యాపిల్ జ్యూస్, ఆపిల్ సిడార్ వెనిగర్, తేనె, ఉప్పు, మిరియాల పొడి అలివ్ ఆయిల్ వేసి చాగా కలిపి ఆ రసాన్ని కలిపి ఉంచిన యాపిల్ ముక్కలపై పోసి ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి.. అంతే ఎంతో రుచికరమైన.. బలవర్దకమైన.. కమ్మనైన ఫ్రూట్​ సలాడ్​ రెడీ..!