427 గ్రామాలకు ఈ బుడ్డోడే పెదరాయుడు

427 గ్రామాలకు ఈ బుడ్డోడే పెదరాయుడు

ఓ బుడ్డోడు 9 ఏళ్లకే ముఖ్యమంత్రి అయ్యాడు. సీఎం అయ్యింది రాష్ట్రానికి కాదు. తమిళనాడులోని తిరువన్నమల్లై జిల్లాలో ఉండే కొండ ప్రాంతానికి. ఈ పిల్లోడి పేరు శక్తివేల్. ఐదో తరగతి చదువుతున్నాడు. జావదు కొండ ప్రాంతంలోని 427 గ్రామాలకు ఇతనే సీఎం. ఈ 427 గ్రామాల్లో బుడ్డోడి ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు. ఇక్కడ పోలీసులు, న్యాయ వ్యవస్థ ఏం ఉండవు. ఊళ్లల్లో ఏ చిన్నా పని జరగాలన్న బుడ్డోడి పర్మిషన్ కంపల్సరీ. ఇంట్లో  గొడవలు మొదలు భూముల పంచాయితీ వరకు బుడ్డోడే చేస్తాడు. 

ఉళ్లల్లో పరిపాలన సజావుగా జరగడానికి ప్రతి ఊళ్లో కొందరు వ్యక్తులతో ఓ వ్యవస్థ ఉంటుంది. వాళ్లందిరీ హెడ్ ఈ బుడ్డోడే. అంతకుముందు ఈ పిల్లోడి తాత ఈ ఊళ్లకు పెద్దగా వ్యవహరించేవాడు. అతడు చనిపోవడంతో పదవి బుడ్డోడికి దక్కింది. గ్రామ ప్రజలంతా ఏక గ్రీవంగా శక్తివేల్ ను తమ సీఎంగా ఎన్నుకున్నారు. పంచాయితీలు ఎలా చేయాలనే దానిపై కొన్నిరోజులు బుడ్డోడికి ట్రెయినింగ్ కూడా ఇస్తారట. తన ప్రజలకు న్యాయం చేస్తానని.... తాత వరసత్వాన్ని నిలబెడుతానన్నాడు బుడ్డోడు.