హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువుల వద్ద హైడ్రా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. వీటిని హైడ్రా ఆఫీసులోని సర్వర్ తో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అనుసంధానం చేసి రోజూ పర్యవేక్షించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం నగరంలోని 264 చెరువుల దగ్గర 900 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, హైడ్రా ఆఫీసు నుంచి కమిషనర్రంగనాథ్ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ చెరువులు ఆక్రమణలకు గురి కాకుండా, మట్టి పోసి కబ్బా చేయకుండా ఇప్పటకే లేక్ ప్రొటెక్షన్ టీమ్స్పర్యవేక్షిస్తున్నాయని, వీటికి తోడు సీసీటీవీ కెమెరా వ్యవస్థ అదనంగా అందుబాటులోకి వచ్చిందన్నారు.
హైడ్రా ఆఫీసులోని కంట్రోల్ రూం నుంచి మానిటర్ల ద్వారా నిరంతరం పరిశీలిస్తామని, బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఉన్న మానిటర్లకు కూడా హైడ్రా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను అనుసంధానం చేశామన్నారు. హైడ్రా అడిషనల్ డైరక్టర్ వర్ల పాపయ్య, అడిషనల్ కమిషనర్ ఆర్ సుదర్శన్ ఉన్నారు.
