మేడ్చల్ లో కరోనా పంజా.. నెల రోజుల్లో 9 వేల కేసులు

మేడ్చల్ లో కరోనా పంజా.. నెల రోజుల్లో 9 వేల కేసులు

శివారు జిల్లా మేడ్చల్లో కరోనా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతోంది. కొద్దిరోజుల కిందటి వరకూ పదుల్లో కేసులు రాగా, ఇప్పుడు డైలీ వందకు తక్కువ ఉండడం లేదు. మొదటి నుంచి టెస్టులు, ట్రేసింగ్లో నిర్లక్ష్యంగా ఉండడం, హోం క్వారంటెయిన్లపై పర్యవేక్షణ లేకపోవడంతోనే తీవ్రత పెరుగుతోంది. జనాభా, విస్తీర్ణంలో పెద్దదైన మేడ్చల్ జిల్లా కరోనా కేసుల్లో దూసుకుపోతోంది. అన్లాక్ తర్వాత పరిస్థితి అదుపు తప్పింది. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 32,7 3 2 టెస్ట్​లు చేయగా, 11,336 మందికి పా జిటివ్ వచ్చింది. జులై 3న 7,172 టెస్టులు చేయగా 1,963 పాజిటివ్ గా తేలింది. నెల పూర్తయ్యే సరికే 9వేల కేసులు పెరిగాయి. వైరస్ వ్యాప్తి జిల్లావాసులను టెన్షన్ పెట్టిస్తోంది. కేసులను కంట్రోల్ చేయడంలో అధికారుల తీరుపై విమర్శలొస్తున్నాయి. లోపాలు, సమస్యలపై కంప్లయింట్ చేసినా పట్టించుకోవడం లేదని ప్రజాప్రతినిధులు వాపోతున్నారు.

పర్యవేక్షణ ఉండకనే..

జిల్లాలో మొత్తం 96 పీహెచ్సీల్లో డైలీ 2వేలకు పైగా టెస్టులు చేస్తున్నారు. మొదటి నుంచి కేసులు నమోదవుతున్న ప్రాంతా లన్నీ గ్రేటర్ లోనే ఉండగా, జీహెచ్ఎంసీ పరిధి అంటూ జిల్లా యంత్రాంగం నిరక్ష్ల్యంగా ఉంది. లాక్ డౌన్ లో నామ మాత్రంగా కంటెయిన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసిన అధికారులు కట్టడిపై ఫోకస్ చేయలేదు. ర్యాపిడ్ టెస్టులు అందుబాటులోకి వచ్చాక పాజిటివ్ వచ్చిన వాళ్లుహోం క్వారంటెయిన్ లో ఉంటున్నా పర్యవేక్షించడం లేదు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ జిల్లాకు చెందిన పలు పార్టీనేతలు హోం క్వారంటెయిన్లపై నిఘా పెట్టాలని, ఆయా ఇండ్లనుంచి రాకపోకలు ఉంటున్నాయని స్థానిక, మండలస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్నాలి జిల్లామెడికల్ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు.

టెస్టులు సరే.. నియంత్రణ ఏది ?

గ్రేటర్తో పోల్చితే మేడ్చల్ జిల్లాలో చేస్తున్న టెస్టుల సంఖ్య తక్కువే. కేసులు మాత్రం ఎక్కువగా వస్తున్నాయి. రాష్ట్రవ్యా ప్తంగా పరిశీలిస్తే గ్రేటర్ ఫస్ట్​, మేడ్చల్ సెకండ్, రంగారెడ్డి థర్​ప్లేడ్ ​ప్లేస్ లో ఉన్నాయి. నియంత్రణపై జిల్లాయంత్రాంగం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడం లేదు. ముఖ్యంగా హోం క్వారంటెయిన్లను పకడ్బందీగా నిర్వహించాల్సిఉంది. పాజిటివ్ వ్యక్తుల రాకపోకలపై ఫోకస్ చేస్తేనే తీవ్రత తగ్గుం దనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.