అమితాబ్‌కు ఖలిస్తానీ బెదిరింపులు.. భద్రత పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం!

అమితాబ్‌కు ఖలిస్తానీ బెదిరింపులు.. భద్రత పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం!

బాలీవుడ్  బిగ్ బీ అమితా బచ్చన్ కు కేంద్ర భారీగా భద్రత పెంచనుంది. ఇటీవల పంజాబీ సింగర్, నటుడు దిల్జిత్ దోసాంజ్ ' కౌన్ బనేగా కోరోడ్ పతి' ఎపిసోడ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బిగ్ బీ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నా డు.  ఇది వివాదానికి దారి తీసింది.  ఈ క్రమంలో అమితాబ్ కు బెదిరింపులు వచ్చాయి.

 వివాదానికి కారణం ఇదేనా?

బిగ్ బీ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడాన్ని ఖలిస్తానీ సంస్థ 'సిఖ్స్ ఫర్ జస్టిస్' (SFJ) తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ సంస్థ అధిపతి గురుపత్వంత్ సింగ్ పన్నూ, అమితాబ్‌ను గౌరవించడం అనేది 1984 సిక్కు వ్యతిరేక హింసలో చనిపోయిన వారిని అవమానించడమేనని ఆరోపించారు. అంతేకాకుండా, 1984 అల్లర్లను రెచ్చగొట్టడంలో అమితాబ్ కీలకపాత్ర పోషించారని, ఆయన అప్పుడు "ఖూన్ కా బద్లా ఖూన్" అనే నినాదాన్ని ఇచ్చారని SFJ ఆరోపిస్తోంది. అయితే, బిగ్ బీ గతంలోనే ఈ ఆరోపణలను ఖండించారు.

 దిల్జిత్ కచేరీపై బెదిరింపులు!

ఈ పరిణామాల నేపథ్యంలో, SFJ చీఫ్ పన్నూ, నవంబర్ 1న ఆస్ట్రేలియాలో జరగనున్న దిల్జిత్ దోసాంజ్ మ్యూజిక్ కచేరీని అడ్డుకుంటామని బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశాడు. ఈ బెదిరింపులు దిల్జిత్ అభిమానుల్లో, అలాగే చిత్ర పరిశ్రమలో ఆందోళన కలిగించాయి.

 అమితాబ్‌కు కట్టుదిట్టమైన భద్రత!

ఉగ్రవాద సంస్థ నుంచి వచ్చిన ఈ బెదిరింపులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ వివాదాస్పద ఆరోపణలు, బెదిరింపుల నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ భద్రతను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం అమితాబ్‌కు ఏ స్థాయిలో భద్రత ఉంది, దాన్ని ఏ స్థాయికి పెంచబోతున్నారు అనే వివరాలు తెలియాల్సి ఉంది. దేశంలో సీనియర్ నటుడిగా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వ్యక్తిగా బిగ్ బీ భద్రతను కట్టుదిట్టం చేయనుంది.