 
                                    చలికాలం మొదలైంది. ఈ సీజన్ లో జనాలు దగ్గు.. జలుబు..కఫం వేధిస్తాయి. ఇప్పటికే కొంతమంది ఆ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి లక్షణాలు దరిచేరకుండా ఉండాలంటే మన కిచెన్ లో ఉండే లవంగంతో నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో దగ్గు, జలుబు, జ్వరాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటాయి.ఇలాంటి వాటిని నివారించడానికి వంటగదిలో ఉండే సుగంధ ద్రవ్యాలతో వాడే లవంగంతో దూరం చేయవచ్చు.
ALSO READ : ఎక్కువ టైం కూర్చోవడం అంటే..
- లవంగం ఒక సాధారణ సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు అది చిన్నదైనా శక్తివంతమైన ఔషధం. లవంగం వాడకం వంటకాలకు రుచిని, సువాసనను అందించడమే కాకుండా శరీరాన్ని లోపలి నుంచి బలపరచే గుణాలు కలిగి ఉంటుంది
- లవంగాలలో మాంగనీస్, విటమిన్ కె, పొటాషియం, బీటా కెరోటిన్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం, విటమిన్ B-6, ప్రోటీన్, ఫైబర్, రైబోఫ్లావిన్, నియాసిన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
- రాత్రి పడుకునే ముందు ఒక్క లవంగం నోటిలో ఉంచుకోవడం అనేక చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు సహజమైన పరిష్కారాన్ని అందిస్తుంది.
- లవంగంలో ఉండే యూజెనాల్ అనే పదార్దం శక్తివంతమైనది. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. దీని వలన శరీరంలో ఇన్ఫెక్షన్లు తగ్గిపోవడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- రాత్రంతా లవంగం నోటిలో ఉంచుకోవడం వలన అది నెమ్మదిగా లాలాజలంలో కరిగి నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాలను చంపుతుంది. ఫలితంగా నోటి దుర్వాసన పూర్తిగా పోయి, నోరు శుభ్రంగా, తాజాగా ఉంటుంది. క్రమం తప్పకుండా వాడితే పళ్ల చుట్టూ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
- గొంతు నొప్పి, పొడి దగ్గు వంటి సమస్యల సమయంలో లవంగం వాడడం చాలా ప్రయోజనకరం. దీని వెచ్చని ప్రభావం గొంతులోని ఇర్రిటేషన్‌ను తగ్గించి, కఫాన్ని బయటకు పంపుతుంది. రాత్రి లవంగం చప్పరించడం వలన గొంతు సాంత్వన పొందుతుంది, నిద్ర కూడా సుఖంగా పడుతుంది.
- లవంగం జీర్ణక్రియను ప్రోత్సహించే గుణం కలిగి ఉంటుంది. అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. రాత్రి లవంగం తీసుకోవడం వలన ఉదయం కడుపు తేలికగా అనిపిస్తుంది. ఇది శరీరంలో టాక్సిన్లను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
- లవంగంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్‌ను బలోపేతం చేస్తాయి. క్రమం తప్పకుండా వాడడం వలన వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ చిన్న చిట్కా పెద్ద ఆరోగ్య లాభాన్ని అందిస్తుంది.
- లవంగం తేలికపాటి అనస్థీటిక్ ప్రభావాన్ని కలిగి ఉండటంతో దంతాల నొప్పిని తాత్కాలికంగా తగ్గిస్తుంది. చిగుళ్ల వాపు, ఇన్ఫెక్షన్లను నివారించి దంతాలను బలంగా ఉంచుతుంది. పంటి నొప్పితో తరచుగా బాధపడేవారికి ఇది సహజమైన నివారణ.
మొత్తం మీద, లవంగం వంటగదిలో ఒక సుగంధద్రవ్యం మాత్రమే కాదు, ప్రతి ఇంటికి అవసరమైన సహజ ఔషధం కూడా. రాత్రి పడుకునే ముందు ఒక్క లవంగం నోటిలో ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యానికి అనేక విధాలా మేలు జరుగుతుంది.

 
         
                     
                     
                    