 
                                    టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యాశ్రీ జంటగా నటిస్తున్న చిత్రం 'ఆంధ్రా కింగ్ తాలుకా'. మహేష్ బాబు డైరెక్షన్ల్ రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ .. ఈసారి గట్టిగానే విజయంగా సాధిస్తామన్న ధీమా ఉన్నారు. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేయగా.. లేటెస్ట్ గా మరో మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్..
'చిన్ని గుండెలోనా' అంటూ సాగే ఈ సాంగ్ శ్రోతల్ని అలరిస్తోంది. ఈ మూవీ నవంబర్ 28న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓ ఫ్యాన్ బయోపిక్ అనే ట్యాగ్ లైన్ తో దీనిని నిర్మిస్తున్నారు. సినిమా హీరోలు, వాళ్ల ఫ్యాన్స్ మధ్య ఉండే ఎమోషన్స్ వంటి అంశాలను చూపిస్తూ .. మరోవైపు ప్రేమకథను ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మహేష్ బాబు మార్క్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఈ సినిమాకు రామ్ కేవలం హీరోగానే పరిమితం కాలేదు. సింగర్ గా టాలెంట్ ను చూపించారు. . ఈ సినిమాలో ఒక పాటకి స్వయంగా ఆయనే లిరిక్స్ అందించారు. అంతేకాకుండా, మరో పాటను తానే స్వయంగా పాడారు. ఇంతకుముందు రామ్ ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు. కానీ వాటికి వచ్చిన స్పందన చూసి ఈసారి సొంతంగా లిరిక్స్ రాసినట్లు తెలుస్తోంది.  మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సొంత చేసుకుంటారో చూడాలి.
 

 
         
                     
                     
                    