Mass Jathara Censor Review: ‘మాస్ జాతర’ సెన్సార్ రివ్యూ.. ఫస్టాఫ్, సెకండాఫ్ టాక్ ఎలా ఉందంటే?

Mass Jathara Censor Review: ‘మాస్ జాతర’ సెన్సార్ రివ్యూ.. ఫస్టాఫ్, సెకండాఫ్ టాక్ ఎలా ఉందంటే?

మాస్ రాజా రవితేజ, బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’. మనదే ఇదంతా క్యాప్షన్. రవితేజ కెరీర్‌‌‌‌లో ఇది 75వ చిత్రం. భాను భోగవరపు తెరకెక్కించిన ఈ మూవీ పలు వాయిదాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవాళ శుక్రవారం (2025 అక్టోబర్ 31న) సాయంత్రం 6 గంటలకు పెయిడ్ ప్రీమియర్లు పడనున్నాయి. అంటే, ‘మాస్ జాతర’ రేపు శనివారం (నవంబర్ 1న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో U/A సర్టిఫికెట్‌తో విడుదల కానుంది. నిడివి 2 గంటల 40 నిమిషాలు అంటే.. 160 మినిట్స్ రన్ టైమ్‌గా ఫిక్స్ చేశారు మేకర్స్. 

‘ధమాకా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ, శ్రీలీల కలిసి నటించిన మూవీ మాస్ జాతర. ఈ క్రమంలోనే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘మాస్‌, కామెడీ అండ్‌ యాక్షన్‌..’ ఇలా అన్నీ కలకలిపిన ఎంటర్‌టైన్‌మెంట్‌గా మాస్ జాతర రాబోతుంది. ఇందులో రవితేజ పవర్‌‌‌‌ఫుల్ రైల్వే పోలీస్ ఆఫీసర్‌‌‌‌గా కనిపించనున్నాడు. శ్రీలీల స్టూడెంట్ పాత్రలో కనిపిస్తుంది. హీరో శ్రీవిష్ణు బ్లాక్ బస్టర్ సామజవరగమన మూవీకి కథను అందించిన.. కథ రచయిత భాను భోగవరపు.. ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు.

ఈ అంశాలకు తోడు భీమ్స్ సిసిరోలియో సాంగ్స్, సినిమా రిలీజ్కు ముందే చార్ట్ బ్లాస్టర్స్గా నిలిచాయి. ఈ క్రమంలో సినిమాపై మంచి హైప్ నెలకొంది. ఇదిలా ఉంటే.. మరికొన్ని గంటల్లో ప్రీమియర్ల ద్వారా సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో సెన్సార్ నుంచి వచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

సెన్సార్ ప్రకారం ‘మాస్ జాతర’ రివ్యూ చూస్తే.. సెన్సార్ సభ్యులు, అధికారులు సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశారని టాక్ వినిపిస్తోంది. విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాల బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో గంజాయి అక్రమ రవాణా ఓ అంశంగా కథ సాగుతుందని సమాచారం. అయితే, కథను ఎక్కడ రివీల్ చేయట్లేదు. కానీ, ఫస్ట్ హాఫ్‌ అదిరిపోయిందట. యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్స్, కామెడీ, లవ్ ట్రాక్ అన్నీ ఎంటర్టైన్ చేస్తాయట. సినిమా స్టార్టింగ్లో వచ్చే ఫైట్‌ అదిరిపోతుందని, అందులో మాస్ రాజాకు పడిన మాస్ ఎలిమెంట్స్ హైలైట్ అని టాక్.

అలాగే, ట్రైన్‌లో అక్రమ రవాణా నేపథ్యంలో వచ్చే ఇంటర్వెల్ ఫైట్‌, జాతర సీక్వెన్స్ సినిమాకే అతిపెద్ద హైలైట్స్ అని అంటున్నారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లా కాకుండా ఓ షాకింగ్ ట్విస్ట్ పెట్టారట డైరెక్టర్. ఈ ట్విస్ట్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుందని సెన్సార్ టాక్. ఫస్టాఫ్తో పోల్చి చూస్తేనే.. సెకండాఫ్ కొంచెం డోస్ తగ్గిందని.. అయిన్నప్పటికీ.. సెకండాఫ్లో కూడా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయని అంటున్నారు. రవితేజ-శ్రీలీల మధ్య రొమాన్స్, కామెడీ ట్రాక్ వీపరీతంగా ఆకట్టుకునేలా డిజైన్ చేశారట డైరెక్టర్. రవితేజ-నవీన్ చంద్ర మధ్య వచ్చే ప్రతి సీన్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయని, అరవింద సమేత తర్వాత ఈ సినిమాతో నవీన్ అదరగొట్టేశాడని అంటున్నారు. ఓవరాల్గా సినిమా ఫుల్ మాస్ ఫీస్ట్లా మెప్పిస్తుందని సెన్సార్ నుంచి టాక్ వచ్చినట్లు వైరల్ అవుతుంది. 

ఇకపోతే, ఈ సినిమాతో రవితేజ కమ్‌బ్యాక్ ఇస్తాడని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. మాస్, కామెడీ ఎలిమెంట్స్‌తో పాటు యాక్షన్‌తో సినిమా ఫుల్ విందుభోజనంలా ఉండేలా ప్లాన్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగానే రవితేజ, శ్రీలీల కాంబినేషన్ మరోసారి దుమ్మురేపిందంటూ మేకర్స్ సైతం చెప్పుకొస్తున్నారు. రవితేజ ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా భీమ్స్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పుకోవాలి. తను కంపోజ్ చేసిన మాస్ సాంగ్స్కు.. ఆడియన్స్ లేచి స్టెప్పులేయాల్సిందే మేకర్స్ అంటున్నారు. చూడాలి మరి మాస్ జాతర రవితేజకు ఎలాంటి హిట్ అందిస్తుందో !! 

U/A' సర్టిఫికేట్: ఎవరైనా  దీన్ని చూడవచ్చు.. కాకపోతే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ చిత్రాన్ని వారి తల్లిదండ్రులతో కలిసొ లేదా పెద్దల తోడుతో చూడాలని సూచిస్తారు. ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాల్లో హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు,  కొంతవరకు నగ్నత్వం ఉంటుంది.