ఫ్యామిలీ మెంబర్స్ మధ్య వైభవంగా అల్లు శిరీష్ - నయనిక ఎంగేజ్మెంట్..

ఫ్యామిలీ మెంబర్స్ మధ్య వైభవంగా అల్లు శిరీష్ - నయనిక ఎంగేజ్మెంట్..

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ఇటీవలే తాను త్వరలోనే ఓ ఇంటివాడిని కాబోతున్నానంటూ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు శిరీష్, నయనికల నిశ్చితార్ధం శుక్రవారం ( అక్టోబర్ 31 ) హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలతో పాటు కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య శిరీష్ నయనిక ఉంగరాలు మార్చుకున్నారు. హైదరాబాద్ లోని నయనిక నివాసంలో జరిగిన ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ లు ఫ్యామిలీతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు.

శిరీష్, నయానికల ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు కంగ్రాట్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉండగా.. ఎంగేజ్మెంట్ కి ముందురోజు వర్షం కారణంగా అటంకం కలిగిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అల్లు శిరీష్. అయితే.. ఇవాళ వాతావరణం అనుకూలించడంతో హైదరాబాద్ లో ఎంగేజ్మెంట్ నిర్వహించారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Allu Sirish (@allusirish)

ఈ వేడుక అల్లువారి ఇంట జరుగుతున్న చివరి నిశ్చితార్థం. ఇక ఇటీవల అల్లు అరవింద్ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకకు కాబోయే కొత్త కోడలు నయనిక కూడా హాజరైంది. ఆమెతో కలిసి అల్లు ఫ్యామిలీ గ్రూప్ ఫోటో కూడా దిగింది. ఆమె ఫోటోతో ఉన్న పిక్స్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.  ఆ వెంటనే జరిగిన తప్పును స్నేహరెడ్డి సరిదిద్దుకున్నారు. నయనిక ఫోటోను క్రాఫ్ చేసి పోస్ట్ చేశారు.