జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

శుక్రవారం ( అక్టోబర్ 31 ) జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలోని షేక్ పేట్ డివిజన్ లోని మారుతి నగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మారుతి నగర్ ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. నాయి బ్రాహ్మణులకు సంబందించిన సబ్సిడీ అంశాన్ని వచ్చే క్యాబినెట్ లో ప్రస్తావిస్తానని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ళు కావాలని అడుగుతున్నారని.. అర్హులైన వారికి ఇళ్లను ఇస్తామని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 

ఫిష్ మార్కెట్ నిర్మాణానికి సంబంధించి మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారని.. ఎన్నికల తర్వాత నిర్మాణం చేపడతామని అన్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ కి సంబంధించి కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని అన్నారు. ఇప్పటికే చాలా అభివృద్ధి పనులు చేశామని.. ఇంకా ఏం కావాలన్నా చేస్తామని అన్నారు మంత్రి వివేక్. ఇంకా మూడేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని.. అన్ని పనులు చేస్తామని అన్నారు.

పదేళ్లు ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఏం చేయలేదని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని అన్నారు మంత్రి వివేక్. ఇంకా క్యాడర్ డెవలప్ చేయాలని.. మీతో ఉండి నేను పనిచేస్తానని అన్నారు మంత్రి వివేక్.