జూబ్లీహిల్స్ ట్రాఫిక్ సీఐ పై బదిలీ వేటు..లంచం ఆరోపణలపై మరో ముగ్గురు కూడా..

జూబ్లీహిల్స్ ట్రాఫిక్ సీఐ పై బదిలీ వేటు..లంచం ఆరోపణలపై  మరో ముగ్గురు కూడా..

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్ నర్సింగరావు, ఎస్సై అశోక్, హోంగార్డ్ కేశవులు, కోర్టు కానిస్టేబుల్ సుధాకర్​పై బదిలీ వేటు పడింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చలాన్లు క్లియర్ చేసేందుకు పలువురి నుంచి లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో వీరిని బదిలీ చేస్తూ సీపీ సజ్జనార్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. వీరిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశించారు. పోలీస్ వ్యవస్థలో పారదర్శకత ఉండాలని, అవినీతి , విధుల్లో నిర్లక్ష్యం ఉండకూడదని సజ్జనార్ స్పష్టం చేశారు.