రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పల్లె పోరు ప్రశాంతం

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పల్లె పోరు ప్రశాంతం
  • మూడో ఫేజ్​లోనూ పోటెత్తిన ఓటర్లు
  • రెండు జిల్లాల్లోనూ కాంగ్రెస్​దే హవా

ఇబ్రహీంపట్నం/పరిగి, వెలుగు: రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో సర్పంచ్​ఎన్నికలు మొత్తం మూడు విడతల్లో చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. రంగారెడ్డి జిల్లాలో మూడో విడతలో బుధవారం 7 మండలాల్లో ఎన్నికలు జరగగా, మొత్తం 86.22 శాతం ఓటింగ్ నమోదైంది. మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు, మహేశ్వరం పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. 
రంగారెడ్డి జిల్లాలో మూడో విడతలో 174 గ్రామాలకు గాను 163 గ్రామాల్లో ఎన్నికలు జరగ్గా,10 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో కాంగ్రెస్​84, బీఆర్ఎస్ 50, బీజేపీ 27, ఇతరులు 11 స్థానాల్లో గెలుపొందారు.  ఒక గ్రామ ఫలితం ఇంకా అందలేదు. 

మొత్తం మూడు విడతల్లో కలిపి 526 గ్రామ పంచాయతీలకు ఎన్నికల్లో  కాంగ్రెస్ ‌‌-246, బీఆర్​ఎస్​-181, బీజేపీ-47, ఇతరులు- 50 స్థానాల్లో గెలుపొందారు. ఒక గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగలేదు. ఒక గ్రామ ఫలితం ఇంకా అందలేదు. 

 వికారాబాద్​లో 83.56 శాతం పోలింగ్

వికారాబాద్​ జిల్లాలో ఫేజ్​3లో పరిగి, దోమ, కుల్కచర్ల, పూడూరు, చౌడపూర్​ మండలాల్లో ఎన్నికలు జరగగా, మొత్తం 83.56 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. పరిగి మండల పరిధిలోని సయ్యద్​పల్లి గ్రామం సమస్యాత్మకంగా ఉండడంతో ఎస్పీ స్నేహా మెహ్ర పరిశీలించారు. దేవునోనిగూడెం, బసిరెడ్డిపల్లి, రంగాపూర్​ గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి షేక్​ యస్మిన్​ భాష పరిశీలించారు. 

మూడో విడతలో 157 గ్రామాలకుగాను కాంగ్రెస్ 95​, బీఆర్ఎస్ 48, బీజేపీ 5, ఇతరులు 9 స్థానాల్లో గెలుపొందారు.
మొత్తం మూడు విడతల్లో కలిపి 594 గ్రామ పంచాయతీలకు ఎన్నికల్లో  కాంగ్రెస్ ‌‌-360, బీఆర్​ఎస్​-157, బీజేపీ-12, ఇతరులు- 65 స్థానాల్లో గెలుపొందారు. ఒక గ్రామ పంచాయతీ లో ఎన్నికలు జరగలేదు.