సహన.. సహన.. ది రాజా సాబ్ సాంగ్ రిలీజ్

సహన.. సహన.. ది రాజా సాబ్ సాంగ్  రిలీజ్

ప్రభాస్‌‌ హీరోగా మారుతి రూపొందిస్తున్న   పాన్ ఇండియా చిత్రం ‘ది రాజా సాబ్’. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌‌. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.  ఇప్పటికే ట్రైలర్‌‌‌‌, ఫస్ట్ సాంగ్‌‌తో ఆకట్టుకున్న మేకర్స్‌‌.. బుధవారం సెకండ్ సింగిల్‌‌ను విడుదల చేశారు. ‘సహన సహన’ అంటూ సాగే ఈ పాటను హైదరాబాద్‌‌లోని ఓ మాల్‌‌లో అభిమానుల మధ్య విడుదల చేశారు. 

‘రాజా సాబ్’ రాకతో ఈ సంక్రాంతి రెబల్‌‌ సంక్రాంతి అవుతుందని, ఫ్యాన్స్‌‌ను అలరించేలా ఉండబోతోందని దర్శకుడు మారుతి ఈ సందర్భంగా చెప్పారు.  బ్యూటిఫుల్‌‌ మెలోడీగా ‘సహన సహన’ పాటను తీసుకొచ్చామని, రాబోయే మరో రెండు పాటలు కూడా ప్రేక్షకులను అలరించేలా ఉంటాయని సంగీత దర్శకుడు తమన్ చెప్పారు.

 హైదరాబాద్‌‌లోని పబ్లిక్‌‌ గ్రౌండ్స్‌‌లో ప్రీ రిలీజ్‌‌ ఈవెంట్‌‌కు ప్లాన్ చేస్తున్నామని,  ప్రభాస్‌‌ రేంజ్‌‌ను ఈ సినిమాలో చూడబోతున్నారని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ అన్నారు.  హీరోయిన్స్‌‌ నిధి అగర్వాల్,  రిద్ది కుమార్‌‌‌‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.