బీఆర్ఎస్ కు ఓటేస్తే.. బీజేపీకి వేసినట్లే : మంత్రి వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్ కు ఓటేస్తే.. బీజేపీకి వేసినట్లే : మంత్రి వివేక్ వెంకటస్వామి

శుక్రవారం ( అక్టోబర్ 31 ) టోలిచౌకిలోని జానకినగర్ మైనార్టీ నేతలతో సమావేశంలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి వివేక్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఇన్ని కోట్లు, అక్కడ అన్ని కోట్లు అని చెప్తే నిజమని అనుకున్నానని.. కానీ, కేవలం ప్రకటనలు మాత్రమే చేశారని.. పనులు ఎక్కడా చేయలేదని అన్నారు.

బీఆర్ఎస్ హయాంలో ఎక్కడా రోడ్లు, నాలాలు, డ్రైనేజీలు నిర్మాణం చేయలేదని అన్నారు మంత్రి వివేక్. తాను ఇంచార్జి అయ్యాక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో పనులు చేశామని.. షేక్ పేట్ డివిజన్ లో రూ. 100 కోట్ల పనులు చేశామని అన్నారు మంత్రి వివేక్. తనకు మంత్రి పదవి ఇచ్చేటప్పుడు మల్లికార్జున ఖర్గే ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పారని అన్నారు.

ఒక మంత్రి పదవి ముస్లింల కోసం పక్కన పెట్టాలని ఖర్గే చెప్పారని అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ బలహీనమైన నాయకుడిని నిలబెట్టి బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తోందని అన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే.. బీజేపీకి వోటేసినట్లే అని అన్నారు. ఖభరస్థాన్ ఇవ్వాల్సిన బాధ్యత తన మీద ఉందని.. నేను ఇప్పిస్తాను... వీలైనంత త్వరగా మీకు స్థలం ఇప్పిస్తామని అన్నారు మంత్రి వివేక్.