వరల్డ్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్లో 91 భారతీయ విశ్వవిద్యాలయాలు

వరల్డ్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్లో 91 భారతీయ విశ్వవిద్యాలయాలు

టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) మ్యాగజైన్ ప్రకటించిన వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌లో రికార్డు స్థాయిలో 91 భారతీయ విశ్వవిద్యాలయాలు చోటు సంపాదించాయి. అత్యుత్తమ పనితీరు కనబర్చిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు 2017 తర్వాత మొదటిసారిగా గ్లోబల్ 250లో చోటు సంపాదించింది. అయితే, టాప్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు) వరుసగా నాలుగో సంవత్సరం కూడా ర్యాంకింగ్‌ల బహిష్కరించాయి. గత సంవత్సరం ఆరవ స్థానంలో ఉన్న ఇండియా ఈ ఏడాది (2024) ర్యాంకింగ్స్ లో నాల్గవ అత్యధిక ప్రాతినిధ్యం కలిగిన దేశంగా గుర్తింపు పొందింది.