అదాలత్​లో భద్రాద్రికొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 92,979కేసులు

అదాలత్​లో భద్రాద్రికొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 92,979కేసులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :   జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్​ అదాలత్​లో 92,979కేసులు పరిష్కారం అయ్యాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపల్​ సీనియర్​ సివిల్​ జడ్జి గొల్లపూడి భానుమతి తెలిపారు. కొత్తగూడెంలోని జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్​ అదాలత్​లో ఆమె మాట్లాడారు. పెండింగ్​ కేసుల అవార్డ్​ అమౌంట్​  దాదాపు రూ. కోటికి పైగా, ప్రమాద నష్టపరిహారం రూ. 2కోట్లు, ఈ చలాన్లు, బీఎస్​ఎన్​ఎల్​ కేసులకు సంబంధించి రూ.కోటి అవార్డు అయ్యాయని పేర్కొన్నారు.

లోక్​ అదాలత్​లను కక్షిదారులు ఉపయోగించుకోవాలన్నారు.  ప్రోగ్రాంలో ప్రిన్సిపల్​ జూనియర్​ సివిల్​ జడ్జి బి. రామారావు, మొదటి అదనపు జూనియర్​ సివిల్​ జడ్జి ఎ. సుచరిత, పీపీ రాధాకృష్ణమూర్తి, బార్​ అసోసియేషన్​ ఉపాధ్యక్షులు డి. రమేష్​. జనరల్​ సెక్రెటరీ రామారావుతో పాటు పలువురు అడ్వకేట్స్​ పాల్గొన్నారు.  

భద్రాద్రిలో.. 

భద్రాచలం : భద్రాచలం జుడిషియల్​ కోర్టులో శనివారం జాతీయ అదాలత్​ జరిగింది. బార్​ అసోషియేషన్​ జనరల్ సెక్రటరీ కె.నవీన్​కుమార్​, అసిస్టెంట్ పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ సాంబ దుర్గాభాయ్​, లోక్​ అదాలత్​ మెంబర్​ ఎం.వీ.రమణ, భద్రాచలం, చర్ల సీఐలు, లాయర్లు తదితరులు ఈ అదాలత్​లో పాల్గొన్నారు.

ఇందులో 50 రాజీ కేసులు, 100 జరిమాన, 1585 సమ్మరీ ట్రయల్​ కేసులు,ఒక మెయింటెనెన్స్​, 54 బీఎస్​ఎన్​ఎల్​ కేసులు పరిష్కారం కాగా రూ.3లక్షలు వసూలు అయ్యాయి. అన్ని రకాల కేసులు మొత్తం 1790 సెటిల్​ అయ్యాయి.