మునుగోడు ఉపఎన్నికలో 93.13 శాతం పోలింగ్

మునుగోడు ఉపఎన్నికలో 93.13 శాతం పోలింగ్

చెదురుమదురు ఘటనలు మినహా మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 93.13శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. నియోజకవర్గంలో 2లక్షల 41వేల 805 ఓట్లకు గానూ..2లక్షల 25వేల 192 ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం వరకు మందకోడిగా సాగిన పోలింగ్..మధ్యాహ్నం తర్వాత పుంజుకుంది. 13 కేంద్రాల్లో రాత్రి 9. 30 గంటల వరకు కూడా పోలింగ్​ జరగగా.. ఓ కేంద్రంలో మాత్రం రాత్రి పదిన్నర గంటల వరకూ కొనసాగింది. 

ఆదివారం ఓట్ల లెక్కింపు

మునుగోడు ఉప ఎన్నిక ఓట్లను ఈనెల 6న నల్గొండలోని ఎఫ్​సీఐ గోడౌన్​లో లెక్కించనున్నారు. ఈవీఎం యూనిట్లను భారీ బందోబస్తు మధ్య చండూరులోని డీఆర్సీ సెంటర్ నుంచి నల్గొండకు తరలించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఓట్ల లెక్కింపునకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసింది. ఇందుకు అవసరమైన టేబుళ్ల ఏర్పాటు, సిబ్బంది శిక్షణ, మాక్ కౌంటింగ్ తదితర ప్రక్రియలన్నీ పూర్తి చేశారు.